< 1 Min

డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.

ముఖ్యఅతిథిగా పాల్గొన్న డిహెచ్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్.

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్

డిహెచ్పిఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ (బి.ఆర్) గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం, కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి తోలుత పూలమాలవేసి ఘన నివాళులు అర్పించి అనంతరం ఫ్ల కార్డులతో నిరసన వ్యక్తం చేసిన సిపిఐ అనుబంధ సంఘం దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకత్వం.

ఈ కార్యక్రమానికి డిహెచ్పిఎస్ జిల్లా నాయకులు బరిగెల భూపేష్ కుమార్ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు,డిహెచ్పిఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి సలిగంటి శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై దాడి జరగడం భారతదేశ న్యాయ చరిత్రలో చీకటి అధ్యాయనమని పేర్కొన్నారు.

జస్టిస్ గవాయ్ పై దాడి చేసిన సీనియర్ న్యాయవాది రాకేష్ కిషోర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి తక్షణమే బహిష్కరించి నాన్బెయిలబుల్ కేసు పెట్టాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇది కేవలం జస్టిస్ గవాయ్ పై జరిగిన దాడి మాత్రమే కాదని భారత రాజ్యాంగంపై జరిగిన దాడిగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డిహెచ్పిఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు చెన్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కరిషా రత్నకుమారి, రాష్ట్ర సమితి సభ్యురాలు మామిడి ధనలక్ష్మి, డి హెచ్ పి ఎస్ జిల్లా నాయకులు రవి కిరణ్, కొచ్చర్ల రాకేష్ కాంత్, టి. నర్సింగరావు ,జంగం ప్రసాదరావు, మంద నిర్మల, పి.భాగ్య, మద్దెల విజయలక్ష్మి, మెరుగు అనసూయ, దార్ల లక్ష్మి, అన్నెం లక్ష్మీనారాయణ,పి.రోజా, ఉస్మాన్ ఖాన్, పి.నర్సిరెడ్డి, బి. సత్తెమ్మ,కే. భారతి, ఎండి ఆశబి, ఎండి యాకుబ్ పాషా, ఎస్.కె అహ్మద్ బాషా బట్టు సన్నీ తదితరులు పాల్గొన్నారు.