భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్
గెరిల్లా పోరాట యోధుడు ఎర్నస్టో చేగువేరా.
సామాజిక పురోగతికి సోషలిజమే మార్గం.
ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా.
గెరిల్లా పోరాట యోధుడు,ధైర్యశాలి,మూర్తీభవించిన మానవత్వం వంటి విలువలు కలిగిన మహనీయుడు ఎర్నస్టో చేగువేరా అని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) కార్యదర్శి ఎస్ కే.ఫహీమ్ దాదా అన్నారు.
చేగువేరా 58వ వర్ధంతిని ఏఐవైఎఫ్ భద్రాది కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో శేషగిరి భవన్లో ఏర్పాటుచేసిన చేగువేరా చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఫహీమ్ దాదా మాట్లాడుతూ… క్యూబాలో జన్మించిన చేగువేరా కేవలం తన దేశానికే కాక అనేక దేశాలలో పర్యటించి పెట్టుబడిదారీ వ్యవస్థపై అలుపెరుగని పోరాటాలు నిర్వహించిన గొప్ప యోధుడు అని వారు ఉద్ఘాటించారు. వంద పండ్లను ఒక్కడే దాచుకోవడం క్యాపిటలిజం- ఉన్నదాంట్లో అందరూ పంచుకోవడం కమ్యూనిజం అని చెప్పిన చేగువేరా మాటలు ప్రజా ఆకాంక్షలకు అద్దం పడుతుందని వారు అన్నారు.
చేగువేరా అమెరికన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అనేక పోరాటాలు నిర్వహించాడని వారు అన్నారు. విప్లవం అనేది పక్వానికొచ్చినప్పుడు కిందపడే ఆపిల్ పండుకాదని-మనమే దాన్ని పోరాడి సాధించుకోవాలి అన్న చేగువేరా మాటలు నేటి ప్రపంచానికి పోరాట పటిమను చూపుతుందని వారు ఉద్ఘాటించారు. విప్లవం అనేది పక్వానికొచ్చినప్పుడు కిందపడే ఆపిల్ పండుకాదని… మనమే దాన్ని పోరాడి సాధించుకోవాలన్నారు.
ముఖ్యంగా స్థానిక ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి, వారిని విప్లవోద్యమం వైపు మళ్ళించకుండా విప్లవాన్ని విజయవంతం చేయడం అసాధ్యమని చే అనేక సందర్భాల్లో చెప్పారన్నారు. రైతాంగం, కార్మిక వర్గం అనే రెండు పట్టాలమీద విప్లవమనే రైలు ప్రయాణం చేయాల్సి ఉంటుందని, తడిమట్టి ముద్ద, మార్క్సిజం మౌళిక భావనలు రెండూ ఒక్కటే అన్నారు. కుమ్మరి కళాకారుని చేతుల్లో ఆ చక్రం మీద మనిషి అవసరం కోసం వివిధ ఆకృతుల్ని రూపొందించినట్లుగా ఆయా సమాజాల భౌతిక పరిస్థితుల్ని బట్టి మార్క్సిజాన్ని అన్వయించుకోవచ్చన్నారు.ఎన్ని రాజకీయ అభిప్రాయాలున్నా, సైద్ధాంతిక విభేదాలున్నా అంతిమంగా ప్రజల విముక్తే విప్లవకారుడి ధ్యేయం కావాలన్నారు.విత్తు నాటే ముందు వాన కురవాలి… పిడుగు పడే ముందు ఉరుము గర్జించాలి… ఒక విప్లవానికి ముందు త్యాగాలు జరిగి తీరాలని చే వ్యాఖ్యలు అనేక పోరాటాలకు అద్దం పడుతుందన్నారు.
క్యూబా దేశంలో విద్య, వైద్యం ఉచితమని, ఈ దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచ దేశాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని వారు అన్నారు. చేగువేరా తాను జీవితాంతం ఏ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా పోరాడాడో అదే అతన్ని ఫ్యాషన్ ఐకాన్ గా మార్చేసి,ఆయన పేరు మీద నేటికీ వందల కోట్ల వ్యాపారం చేయడం విషాదకరమన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.కె. ఖయ్యుమ్, జిల్లా ఉపాధ్యక్షుడు బరిగెల భూపేష్, జిల్లా నాయకులు జావీద్, కొచ్చెర్ల రాకేష్,రణధీర్, ఇర్ఫాన్, నాదీమ్, అజయ్,రవి, విజయ్ కాంత్, త్రినేష్, షారుఖ్, సోహెల్, సంతోష్, యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.
- పురాతన శ్రీ మోక్ష వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి నల్లా సురేష్ రెడ్డి కృషి
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు