< 1 Min

భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
భద్రాచలం
10 అక్టోబర్ 2025
✍️దుర్గా ప్రసాద్

నేషనల్ వైరల్ హేపాటైటిస్ కంట్రోల్ కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదేశాల మేరకు డి ఎం హెచ్ ఓ డాక్టర్ విజయలక్ష్మి సూచనల ప్రకారం వైద్య ఆరోగ్య కేంద్రాలలో పనిచేసే అధికారులు, సిబ్బంది మరియు వర్కర్లందరూ హెపటైటిస్ బి వ్యాక్సిన్ ను తప్పనిసరిగా తీసుకోవాలని అదనపు వైద్యాధికారి డాక్టర్ సైదులు అన్నారు.శుక్రవారంనాడు ఏరియా ఆసుపత్రి భద్రాచలంలో హెల్త్ కేర్ వర్కర్లకు హెపటైటిస్ బి వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టరు. సైదులు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసే సిబ్బంది తాను చేస్తున్నటు వంటి పనిలో భాగంగా తెలిసో తెలియకనో వృత్తిలో భాగంగా హెపటైటిస్- బి బారిన పడే ఆస్కారం ఉంటుందని అన్నారు. ఆస్పత్రిలో పనిముట్లు, సిరంజిలు, బెడ్లు, ఫ్లోరో, ఇతర కలుషిత వ్యర్ధాలను తాకినప్పుడు ఈ వ్యాధి బారిన పడితే సిరోసిస్ ( కాలేయం పనిచేయక ), కాలేయ క్యాన్సర్ సోకే వీలుందని,అందువల్ల హెల్త్ కేర్ సిబ్బంది అందరూ ముందస్తుగా హెపటైటిస్ బి వాక్సినేషన్ ఇస్తున్నట్లు ఆయన అన్నారు. ప్రతి ఒక్క సిబ్బంది హెపటైటిస్ వ్యాక్సినేషన్ తీసుకోవాలని ఆయన కోరారు.

జిల్లాలోని మిగతా అన్ని ఆసుపత్రిలలో పనిచేసే సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ వ్యాక్సినేషన్ మూడు డోసుల్లో ఉంటుందని, ప్రస్తుతం ఇచ్చే డోసు జీరో డోస్ అని, మిగిలిన రెండు డోసులను కూడా నిర్లక్ష్యం చేయకుండా నిర్దేశించిన సమయానికి ఆనుకూలంగా తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

అనంతరం జిల్లా పోగ్రామ్ పర్యవేక్షణ అధికారి డాక్టరు పుల్లారెడ్డి హైపోటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం వలన కలిగే ఉపయోగాలు మరియు సిబ్బందికి ఉన్న అపోహాలను నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ రామకృష్ణ,డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ చైతన్య, జిల్లా ప్రోగ్రాం అధికారులు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.