< 1 Min

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
✍️దుర్గా ప్రసాద్

జగన్నాథపురం లో కొత్వాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలోని BRS పార్టీ చేసిన కుట్రలు కుతంత్రాల వలనే బీసీ ల రిజర్వేషన్ తాత్కాలికంగా నిలిపివయబడిందని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాస రావు అన్నారు. పాల్వంచ మండలం పరిధిలోని జగన్నాథపురం గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ…

బీసీ రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో ఆమోదించి రాష్ట్ర గవర్నర్ ఆమోదానికి పంపిందని కానీ కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం దానిని పెండింగ్ లో పెట్టడం వలనే స్థానిక సంస్థల ఎన్నికలకు కోర్టు స్టే విధించిందన్నారు. బీసీ ల రిజర్వేషన్ ల కోసం ముఖ్యమంత్రి భగీరథ ప్రయత్నాలు చేశారన్నారు.

కేంద్రం, గవర్నర్, ప్రతిపక్షాలు కలసి రాకున్నా ప్రభుత్వం ఒంటరిగా పోరాడిందన్నారు. ఎవరు ఎన్ని కుటిలయత్నాలు చేసిన బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని కొత్వాల అన్నారు.

ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండం వెంకన్న, పెద్దమ్మ తల్లి గుడి చైర్మన్ బాలినేని నాగేశ్వరరావు, ఆర్టిఏ మెంబర్ బాదర్ల జోషి,కాంగ్రెస్ నాయకులు చింతా నాగరాజు, వై వెంకటేశ్వర్లు, కొండం పుల్లయ్య, బాదర్ల బాబూజీ, సమ్మెట అప్పారావు, బానోతు బాలాజీ నాయక్, కామాచారి, తవడోజు బ్రహ్మచారి, నునావత్ దేవా తదితరులు పాల్గొన్నారు.