< 1 Min

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం
10 అక్టోబర్ 25
✍️దుర్గా ప్రసాద్

మెరుగైన ప్రభుత్వ పాలన జరగాలంటే సమాచార హక్కు చట్టం ద్వారా సాధ్యమవుతుందని రిటైర్డ్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోటా దేవదానం అన్నారు.శుక్రవారం నాడు ఐటిడిఏ సమావేశం మందిరంలో సమాచార హక్కు వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అత్యధిక గిరిజన జనాభా నివసిస్తున్న జిల్లా భద్రాద్రి కొత్తగూడెం అని, ఐటీడీఏ పరిధిలో ఎక్కువ శాతం అమాయకులైన గిరిజనులు వివిధ సంక్షేమ పథకాల కొరకు ఐటీడీఏ ద్వారా లబ్ధి పొందడానికి అర్జీలు పెట్టుకుంటారని కానీ వారికి న్యాయం జరగని పక్షంలో ఆర్టిఐ చట్టం ద్వారా సమాచారం అడగడం వారికి హక్కు ఉందని అందుకు సంబంధిత అధికారులు వారు అడిగిన సమాచారాన్ని 30 రోజుల్లో తప్పకుండా అందించి ప్రతి గిరిజనుడికి న్యాయం జరిగేలా చూడాలని అన్నారు.

ఆర్టిఐ చట్టాన్ని1946లో ఐక్యరాజ్య సమితి సమాచారాన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించిందని, ప్రజాస్వామ్యంలో పారదర్శకత జవాబుదారీతనం పెంపొందించడంలో ఈ చట్టం దోహదపడుతుందని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాలలో పనులు సక్రమ పద్ధతిలో జరుగుతున్నది లేనిది ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం ఐటిడిఏ కార్యాలయంలోని అన్ని విభాగాలలో సమాచార హక్కు చట్టం పనితీరు చాలా బాగుందని అన్నారు.ఆర్టిఐ చట్టం ప్రజలను ప్రజాస్వామ్యంలో భాగం చేస్తున్నదని అనేక అనుభవాల తర్వాత 2005లో ఆర్టిఐ చట్టం వచ్చిందని అవినీతిని తగ్గించేందుకు ఉపయోగపడే చట్టమని అన్నారు.

ఈ చట్టం కేవలం సమాచారం తెలుసుకోవడానికే కాక పనులు, రికార్డులు, సంబందిత డాక్యుమెంట్లను తనఖీ చేస్తూ ప్రభుత్వ కార్యాలయాలలో జరుగుతున్న పనులను ప్రజలు పర్యవేక్షించే సాధికారతను కల్పించిందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పరిపాలన అధికారి రాంబాబు, ఎస్ ఓ ఉదయభాస్కర్, ఆర్సిఓ గురుకులం అరుణకుమారి, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ మధుకర్, డి ఎం జి సి సమ్మయ్య, ఉద్యానవన అధికారి ఉదయ్ కుమార్, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ, ఎల్ టి ఆర్ డిటీ నాగేశ్వరరావు, మేనేజర్ ఆదినారాయణ ఐటీడీఏ కార్యాలయంలోని వివిధ విభాగాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.