< 1 Min

Fish Mercury Warning:
కొన్ని చేపల్లో పాదరసం అధికంగా ఉండటంతో వాటి వినియోగం జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా బ్లూఫిన్, బిగ్ ఐ ట్యూనా వంటి ట్యూనా చేపలు ఎక్కువ పాదరసం కలిగి ఉంటాయి. అల్బాకోర్ ట్యూనా పోషకవంతమైనదైనా వారానికి ఒకసారి మాత్రమే తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

సార్డిన్ చేపలు కూడా పాదరసం అధికంగా ఉండటంతో గర్భిణీలు, చిన్న పిల్లలు వీటిని మానేయాలి. మార్కెట్‌లో లభించే క్యాట్ ఫిష్ ఎక్కువగా హార్మోన్లు, కెమికల్స్‌తో పెంచబడుతుండటంతో ఆరోగ్యానికి హానికరం. అందువల్ల చిన్న సైజులో ఉన్న క్యాట్ ఫిష్‌ను మాత్రమే తీసుకోవడం మంచిది. మాకెరెల్ చేపలు ఒమేగా-3తో మంచివి అయినా, పసిఫిక్ కింగ్ మాకెరెల్‌లో పాదరసం అధికంగా ఉంటుంది.

ఇది కిడ్నీ, నరాల వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. అలాగే బసా చేపలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటంతో గుండెపోటు ప్రమాదం ఉంటుంది. ఈ చేపల పెంపకంలో హార్మోన్ల వినియోగం కూడా ప్రమాదకరం.