localnewsvibe

మనిషికి చాలా ముఖ్యమైనది కళ్ళు…
ఆ కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఇందుకోసం మనం తీసుకోవలసిన ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం…

క్యారెట్ :

క్యారెట్ లో విటమిన్ సి ఉంటుంది. ఇందులో విటమిన్ బి, కె, సి6 కూడా ఉన్నాయి. అదనంగా ఫైబర్, మెగ్నీషియం ఉన్నాయి.

బత్తాయి, కమలా :

విటమిన్ సి పుష్కలంగా ఉండే నారింజ, బత్తాయి, కమలా పండ్లలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహకరిస్తాయి. రోజులో పిల్లలు ఒక పండు చప్పున తీసుకుంటే కంటి సమస్యలు దరిచేరవు.

ఉసిరి :

విటమిన్ సి సమృద్ధిగా ఉన్న మరో పదార్థం ఉసిరి. దీనిని రోజుకు ఒకటి చప్పున తీసుకుంటే పిల్లలు, పెద్దలలో కంటి సమస్యలు, జుట్టురాలే సమస్యను కూడా అరికడుతుంది.

బచ్చలి కూర :

చలికాలంలో అధికంగా లభించే బచ్చలి కూరలో ఫోలిక్ యాసిడ్ కంటి నాడిని మెరుగుగా ఉంచుతుంది. పలుచని పప్పులో బచ్చలికూర వేసి వండితే పిల్లలు ఇష్టంగా తింటారు.

స్వీట్ పొటాటో :

బీటా కెరోటిన్, విటమిన్ బి6 ఎక్కువగా ఉంటాయి. ఈ రెండు పదార్థాలు కంటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. బీటా కెరోటిన్ కంటి చూపు మెరుగుపరుస్తుంది. ఇందులో విటమిన్ బి6 ఎముకలు, దంతాల ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి.