కామాఖ్యదేవి ఆలయం – గౌహతి
ఈ ఆలయం గౌహతిలో ఉంది. ఈ ఆలయం బ్రహ్మపుత్రా నదీతీరములో నీలాచల పర్వతముపైన ఉన్నది. ఇది అష్టాదశ మహాశక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ అమ్మవారికి నల్లటి మనిషిని, కుక్కను, పిల్లిని, పందిని, గాడిదను, కోతి, మేక, పావురం మొదలగునవన్నీ నలుపు రంగులో ఉండాలి. అమ్మవారికి అన్నీ నల్లటి జంతువులనే బలి ఇవ్వాలి. ఇదే ఇక్కడ ఆచారం. ఆడ జంతువులను వధించరాదని నియమము ఉన్న అమ్మవారి దేవాలయం. ఇక్కడ అమ్మవారి శరీర భాగం పడినందువలన ఈ ప్రదేశాన్ని స్మశానం అని అంటారు. ఇక్కడ అమ్మవారి యోని భాగం పడినందువలన శివుడు ఇక్కడ అమ్మవారితో కామకేళిలో తేలియాడుతూ ఉంటాడని అంటారు.
అమ్మవారి ‘యోని’ భాగం రాతిమీద చెక్కబడి ఎల్లప్పుడు సన్నని నీటి ఊట ఊరుతూ తడిగా కనిపించే ఆలయం. ప్రేమతో పసిపిల్లవానికి పాలు ఇస్తున్న తల్లి విగ్రహం పశ్చిమ ద్వారాన ఉంది. అమ్మవారు భక్తులకు కన్నతల్లి మాదిరి కాపాడునని చాటి చెప్పే ఆలయం.
బహిష్టు ఉన్న దేవత
ఈ ఆలయంలో అమ్మవారు సంవత్సరమునకు ఒకసారి జూన్ రెండవ వారంలో బహిష్టు అవుతుంది. ఇక్కడ నివసించేవారు దీనిని ‘అంబుబాషి’ సమయం అని అంటారు. దేవాలయం ఈ నాలుగు రోజులు మూసి ఉంచుతారు. అయిదవ రోజు దేవాలయం తెరుస్తారు. అంబుబాషి రోజులలో గౌహతిలో అమ్మవారి దేవాలయములతోపాటు మిగతా దేవాలయములు అన్ని మూసే ఉంచుతారు.
ఇక్కడ కొండపై ఏడు ముఖ్య ఆలయములు కలవు. అవి…
తార,
భువనేశ్వరి,
చిన్నమస్త,
భగళ,
ధూమావతి,
కాళి,
భైరవి.
ఇవికాక ఐదు శివాలయములు ఉన్నాయి. అవి…
అమృతేశ్వర స్వామి,
కోటిలింగ స్వామి,
అఘోర స్వామి,
సిద్ధేశ్వర స్వామి,
కామేశ్వర స్వామి దేవాలయాలు.
గౌహతి నుండి 40 కి.మీ. దూరంలో చట్టగామ్లో భగవతి అమ్మవారి దేవాలయము కలదు. ఇది చంద్రశేఖర పర్వతంపై ఉన్నది. ఇది శీతాకుండం దగ్గర ఉన్నది. ఇది కుండంలో నిరంతరం అగ్ని ప్రజ్వరిల్లుతున్న శక్తి పీఠం.
హయగ్రీవ స్వామి దేవాలయం – గౌహతి
గౌహతి నుండి 22 కి.మీ. దూరములో హోజోలో మణికూట పర్వతముపై హయగ్రీవ స్వామి దేవాలయము కలదు. ఇక్కడ స్వామి వారి ప్రక్కనే కేదారేశ్వర స్వామి వారి విగ్రహము కూడా ఉన్నది.
ఇక్కడ ఉన్న స్వామివారిని హయగ్రీవ మాధవస్వామి అని అంటారు. ఈ హయగ్రీవ అవతారము మత్స్యావతారమునకు ముందు అవతారము. మధు, కైటభులు అనే రాక్షసులు వేదములను దొంగిలించుకుని వెళ్ళేటప్పుడు విష్ణుమూర్తి హయగ్రీవ అవతారమున ఆ రాక్షసులను వధించి వేదములను తిరిగి తీసుకువచ్చి బ్రహ్మదేవునికి ఇచ్చాడు.
బాణాసురుని కుమార్తె ఉషను శ్రీకృష్ణుడు మనుమడు అనిరుద్ధుడు వివాహమాడిన ప్రదేశం, శ్రీకృష్ణుడు బాణాసురుని వధించిన చోటు – అక్కడ వెలసిన దేవాలయము.
దర్రాంగ్ జిల్లాలో తేజోపూర్లో దహపర్వతముపై శ్రీకృష్ణ భగవానుడు వెలసిన దేవాలయము, మరియు త్రిపురారిగా పిలిచే శివ మహాదేవుని దేవాలయము ఇక్కడ ఉన్నాయి.
అశ్వక్రాంత్ స్వామి (విష్ణుమూర్తి) దేవాలయము – గౌహతి
గౌహతిలో అశ్వక్రాంత్ స్వామి (విష్ణుమూర్తి) దేవాలయము కలదు. ఇది బ్రహ్మపుత్ర నదీతీరములో ఉన్నది. సుక్లేశ్వర్ ఘాట్క దగ్గర నదికి ఇటువైపున గౌహతి, అటువైపున ఈ ఆలయం ఉన్నది. ఇక్కడికి వెళ్ళాలంటే పడవల మీద వెళ్ళాలి. ఇక్కడ విష్ణుమూర్తి తాబేలుపై, కప్పపై నీటిలో, నీటి మొక్కలపై తేలియాడుతూ పవళించి ఉంటాడు.
ఈ దేవాలయములో సోమవారము నాడు అమావాస్య వచ్చిన రోజున అతి వైభవముగా ఉత్సవము జరుగుతుంది. గౌహతిలో ఉమానంద స్వామి దేవాలయము కలదు. ఇక్కడి అమ్మవారు ఉమాదేవి. బ్రహ్మపుత్ర నదీ మధ్యలో పీకాక్ ద్వీపములో ఉన్నది.
తామ్రేశ్వరిదేవి ఆలయము – సాడియా
లిఖింపూర్ జిల్లా సాడియాలో తామ్రేశ్వరి దేవి ఆలయము కలదు. పచ్చిమాంసము తినే శ్రీ అమ్మవారుగా సేవించబడు ఆలయము. ఇక్కడ ఉన్న అమ్మవారిని ‘కేశైఖాటి’ అని అంటారు. (దీని అర్ధం పచ్చి మాంసం తినుట అని అంటారు). ఈమె కాళికాదేవి యొక్క అవతారం.
మంగోలియా జాతి రాజులు అయిన చుటియా వంశ రాజులకు ఈ అమ్మవారు ఆరాధ్యదేవత. ఇక్కడ దేశములో వ్యాధులు బాగా ఉన్నప్పుడు ఆరోగ్యవంతులైన వారిని చూసి వారిని కర్రకు కట్టి అమ్మవారికి బలియిస్తారు. ఇలా చేస్తే వ్యాధులు ప్రజలకు రాకుండా ఉంటాయని వారి యొక్క నమ్మకం. ఖైదీలు, నేరస్తులు ఉరి శిక్షకు గురి అయినవారిని అమ్మవారి విగ్రహం ముందు నరకబడు ఆచారము కలిగిన దేవాలయము.
ఇక్కడ ఉన్న అమ్మవారు కాళికాదేవి అవతారము అని అనుకుంటారు. నరబలి అనేది మంగోలియా జాతి ఆచారము. ఇక్కడ మనుషుల తలను నరకటానికి ప్రసిద్ధి చెందిన దేవాలయము.
నవగ్రహములు లింగాకారముగా వున్న దేవాలయము
గౌహతిలో నపగ్రహాలు ఉన్న దేవాలయము కలదు. ఇక్కడి దేవాలయము గుండ్రంగా ఉండి, జేగురు రంగుతో కూడి ఉంటుంది. ఆలయము పై భాగమున గుడి మొత్తం శుద్ధతో దశావతార విగ్రహములు ఉన్నాయి. పూర్వకాలము నుండి ఇక్కడ జోతిష్య శాస్త్ర, ఖగోళ శాస్త్ర, సంఖ్యా శాస్త్ర అధ్యయనం, చర్చలు జరుగుతూ ఉండేవి.
మానసాదేవి ఆలయము – గౌహతిi
గౌహతిలో మానసాదేవి ఆలయము కలదు. ఇది నీలాచలపర్వతముపైన, బ్రహ్మపుత్ర నదీ తీరములో కలదు. కామాఖ్యదేవి అమ్మవారి ఆలయమునకు దగ్గరగా వెలసిన దేవతామూర్తి. ఇక్కడ అమ్మవారిని పూజిస్తే విషం విరిగిపోతుంది. అమ్మవారి శరీరం అంతటా, తలపై, కాళ్ళపై సర్పాల రూపాలు ఉంటాయి. ఈమె సర్పారాజైన వాసుకి సోదరి. జెరుత్కారు మహర్షి అర్ధాంగి.
ఉమానంద స్వామి వారి దేవాలయము
గౌహతిలో ఉమానంద స్వామి వారి దేవాలయము కలదు. ఇక్కడ ఈ స్వామి వారికి 5 ముఖములు, 10 చేతులు ఉంటాయి. ఇక్కడ అమ్మవారు ఉమాదేవి. ఇక్కడ మన్మథుడు – రతీదేవి ఆలయము కలదు. ఇది శివుడు మూడవ కన్ను తెరిచి మన్మథున్ని భస్మము చేసిన ప్రదేశం. పార్వతీదేవి వివాహమయిన తరువాత ఇక్కడే స్వామివారు మన్మథుడిని బ్రతికించినారు. ఇక్కడ పార్వతికి ఆనందము కలిగిన ప్రదేశములో వెలసిన శివలింగము కాబట్టి ఈ స్వామికి ‘ఉమానంద’ స్వామి అని పేరు వచ్చింది.
శ్రీశ్రీ కాంచన కాంతీదేవి అమ్మవారి దేవాలయము – సిల్బార్
సిల్బార్ నుండి 17 కి.మీ. దూరంలో దేవీ ఆలయమంలో శ్రీశ్రీ కాంచన కాంతీదేవి అమ్మవారి దేవాలయము కలదు. చాలా శక్తివంతమైన అమ్మవారిగా ప్రసిద్ధి. బుద్ధుడు, విష్ణుమూర్తి యొక్క అవతారమని నిరూపించుటకు జనార్ధన స్వామి, బుద్ధుని విగ్రహాలు గల ఒకే ఒక దేవాలయం.
గౌహతిలో జనార్ధన స్వామి, బుద్ధుని దేవాలయము కలదు. ఇది ఊరికి మధ్యన ఉన్న కొండపైన ఉన్నది.
పోవా మక్కా హజో – గౌహతి
గౌహతి నుండి 22 కి.మీ. దూరంలో హజోలో మక్కా మసీదు ఉన్నది. బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉన్నది. ఈ స్థలమును దర్శించిన వారికి ‘మక్కా దర్శనము చేసుకుంటే ఎంత పుణ్యం వస్తుందో అందులో నాలుగవ వంతు పుణ్యము వస్తుందని ప్రతీతి.
శివడాల్ స్వామి దేవాలయము – శివసాగర్
జోర్ట్ నుండి 56 కి.మీ. దూరంలో శివసాగర్లో శివసాగర్ సరస్సు ఒడ్డున శివడాల్ స్వామి దేవాలయము కలదు.
పరశురాముడు రాజులనందరినీ 21 సార్లు వెంటాడి, వధించి, తన గండ్రగొడ్డలిని విడిచిపెట్టి, పాపపరిహారార్థము తపస్సు చేసిన స్థలము.
గౌహతి నుండి 16 కి.మీ. దూరంలో పరశురామ కుండములో పరశురాముడు ఇక్కడ తపస్సు చేసిన స్థలము కలదు.
శుక్రేశ్వర్ దేవాలయం – గౌహతి
రాక్షస గురువైన శుక్రాచార్యుల వారిచే ప్రతిష్టింపబడిన శివలింగము
గౌహతిలో శుక్రేశ్వర్లో శివలింగము కలదు. ఇది బ్రహ్మపుత్ర నదీ తీరములో కలదు. ఇక్కడ సంస్కృత పాఠశాల కలదు. ఇక్కడ వెలసిన స్వామివారు చిన్న పానమట్టముపై వెలసి లింగాకారములో ఉంటుంది. ఇది ఎర్రటి లింగము.
మరి కొన్ని ముఖ్య దేవాలయాలు
గౌహతి టౌన్ నుండి 7 కి.మీ. దూరంలో శక్తి పీఠము కలదు. ఇక్కడ అమ్మవారు తారాదేవి.
గౌహతి నుండి 190 కి.మీ. దూరంలో తేజ్పూర్ భైరవీదేవి ఆలయం ఉన్నది. ఇది బ్రహ్మపుత్ర నదీతీరంలో కలదు.
సిమాల్ గురి రైల్వే స్టేషన్ నుండి 17 కి.మీ. దూరంలో శివసాగర్ లో ముక్తినాథ్ స్వామి దేవాలయము ఉన్నది.
గౌహతిలో ఉగ్రతార అమ్మవారి దేవాలయము కలదు.
గౌహతిలో సుక్తేశ్వర స్వామి దేవాలయము ఉన్నది. ఇది బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉన్నది.
జోర్హాట్ నుండి 28 కి.మీ. దూరంలో శివసాగర్ బార్బోపాయ్ స్వామి దేవాలయము కలదు. ఇక్కడ స్వామి వారిని ‘శివడాల్’ అని పిలుస్తారు. ఇది శివసాగర్ సరస్సు ప్రక్కన ఉన్నది.
నవాంగ్ జిల్లాలో శిలాఘాట్లో మహిషాసురమర్ధిని దేవాలయము కలదు.
గౌహతి నుండి 190 కి.మీ. దూరంలో తేజ్పూర్లో మహాభైరవ్ స్వామి దేవాలయము కలదు. ఇక్కడి అమ్మవారు భైరవీదేవి. ఇది బ్రహ్మపుత్ర నదీ తీరంలో ఉంది.
ఖాట్మాండులో జగన్నాథ స్వామి దేవాలయం కలదు. ఇక్కడి అమ్మవారు గుహేశ్వరి. ఇది భాగమతీ నదీ తీరంలో ఉంది.
ఖాట్మాండుకి దగ్గరలో పార్కింగ్ షేక్ నారాయణ స్వామి దేవాలయము కలదు. ఇక్కడ కాళికాదేవి ఆలయము కూడా ఉంది.
ఖాట్మాండుకి 25 కి.మీ. దూరంలో బడగామ్ లో సూర్య వినాయక స్వామి దేవాలయము కలదు.
ఖాట్మాండు నుండి 14 కి.మీ. దూరంలో భట్గామ్ లో దత్తాత్రేయ, శివ, ఉగ్రచండి, వత్సలాదేవి, సూర్యవినాయక, చెంగనారాయణ స్వామి దేవాలయములు కలవు.
ఖాట్మాండులో కాలభైరవ, శ్వేతభైరవ, మంజుదేవ, త్రిలోక్యమోహన్, హనుమాన్, జగన్నాథ, శివ, పార్వతి, మత్స్యేంద్రనాథ్, ఆకాశభైరవస్వామి దేవాలయము కలవు.
ఖాట్మాండు నుండి 10 కి.మీ. దూరంలో ఫర్పింగ్ శేషనారాయణస్వామి దేవాలయము’ కలదు.
ఫర్పింగ్ నుండి 3 కి.మీ. దూరంలో దక్షిణ కాళిలో శివమహదేవి స్వామి దేవాలయము కలదు. ఇక్కడ కాళికాదేవి ఆలయము కూడా కలదు.
పాటన్ నుండి 12 కి.మీ. దూరంలో ఛపాగామ్లో టీకభైరవ స్వామి దేవాలయము కలదు. ఇక్కడి అమ్మవారు లీలా సరస్వతి అమ్మవారు.
గౌహతిలో నరసింగ్ స్వామి దేవాలయము కలదు.
బారాపేటలో వైష్ణవమాత ఆలయము కలదు.
శివసాగర్లో ముక్తినాథ్ స్వామి దేవాలయము కలదు.
మానస నదీ తీరంలో బారాపేటలో ఆచార్య మహదేవ్ స్వామి దేవాలయము కలదు. ఇక్కడ స్వామివారు విష్ణుమూర్తి.
గౌహతి నుండి 120 కి.మీ. దూరంలో నౌగాంగ్ లో విష్ణుమూర్తి దేవాలయము కలదు.
జోరహట్ నుండి 5 కి.మీ. దూరంలో మజౌలిలో విష్ణుమూర్తి స్వామి దేవాలయము కలదు. ఇది నది మధ్యలో దీవిపైన ఉన్నది.
సిల్చార్ నుండి 37 కి.మీ. దూరంలో భువనేశ్వర్లో హర, పార్వతి, శ్రీకృష్ణ, రామ, లక్ష్మణ, గరుడ, హనుమాన్ స్వామి దేవాలయములు కలవు,
సౌదియా నుండి 64 కి.మీ. దూరంలో తేజులో తామ్రేశ్వరి అమ్మవారి దేవాలయము కలదు. ఇక్కడ రామ, లక్ష్మణ, గరుడ, హనుమాన్ స్వామి దేవాలయము కలదు.
జోర్హాట్ నుండి 30 కి.మీ. దూరంలో కమలావరి సత్రంలో హనుమాన్ స్వామి దేవాలయం ఉంది