కాగజ్ నగర్
తిర్యాని మండలం
పంగిడి మాదర
డిసెంబర్10,2022

పోలీసులు మీకోసం కార్యక్రమంలో భాగంగా ఉచిత కుట్టుమిషన్ లు, వృద్దులకు దుప్పట్లు జిల్లా ఎస్పి కే, సురేష్ కుమార్ శనివారం రోజున పంపిణీ చేసారు. తిర్యాని మండలం, పంగిడి మాదర లో జిల్లా పోలీస్ వసుధ స్వచ్ఛంద సంస్థ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ ల ఉచిత పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ కె. సురేష్ కుమార్ హాజరయ్యారు.

ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ…

వసుధ స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసిన ఈ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉపాధి కోసం ఎవరి పై ఆధారపడకుండా ప్రతి మహిళ స్వయం ఉపాద్ పొందాలని,తన కాళ్ళ పై నిలబడాలని అన్నారు.


మహిళలకు ఎవరికి సాటి రారని, గొప్పగా ఆలోచించే శక్తి అతివలకే సాధ్యమని కొనియాడారు. జిల్లాలో వసుధ స్వచ్ఛంద సంస్థ వసుదైక కుటుంబం కోసం కృషి చేస్తుందని ఎస్పీ తెలిపారు. వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి, ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కమ్యూనిటీ పోలీసింగ్ వల్ల ప్రజల్లో పోలీసులకు స్నేహపూరిత వాతావరణం నెలకొందని, ప్రజలకు పోలీస్ వారు ఎప్పుడు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అసాంఘిక శక్తులకు, కొత్త వ్యక్తులకు ఆశ్రయం కల్పించకూడదని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని, ప్రజల ధనమానప్రాణాలను రక్షించటంలో పోలీసులు ముందుంటారని గ్రామ ప్రజలకు తెలియజేసారు.ప్రజలకు ఎపుడూ ఏ సమస్య ఉన్న డయల్ 100 కి కాల్ చేసి తెలియజేయాలి అని, లేని పరిస్థితులలో పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్. పి. అచ్చేశ్వర్ రావు, వసుధ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు రాధాకృష్ణ, సెక్రటరీ సూర్య, కో-ఆర్డినేటర్స్, ఉమ, కిరణ్, ఆసిఫాబాద్ డి. ఎస్. పి. శ్రీనివాస్, సి. ఐ. నరేందర్, ఎస్.ఐ. రమేష్, గ్రామ సర్పంచ్ జంగు, ఎం. పి.టి.సి. కేశవరావు,తదితరులు పాల్గొన్నారు.