ఓం విఘ్నేశ్వరాయః నమః
ప్రథమ పూజ్యునిగా పూజలందుకునే విఘ్నేశ్వరుడు సిద్ది బుద్ది సమేతుడై విఘ్నములు కలుగకుండా శుభ లాభాలను భక్తులకు అనుగ్రహిస్తాడు.
వినాయక అవతారాలలో ముఖ్యంగా చెప్పుకో దగ్గవి అష్ట వినాయక అవతారాలు.
ఈ అవతారాలను తెలుసుకొని పూజించటం వలన ఎలాంటి అష్ట కష్టాలైనాల పోతాయని పురాణాలలో చెప్పబడ్డాయి.
అవి
1.మయూరేశ్వర్
2.సిద్ది వినాయక
3.బల్లాలేశ్వర్
4.వరద వినాయక
5.చింతామణి
గిరిజాత్మక్
7.విఘ్నేశ్వర్
8.మహా గణపతి
అష్ట వినాయక మందిరాలు – విశిష్టత – విశేషాలు
- మయూరేశ్వర్
మహారాష్ట్ర లోని మోర్ గావ్ గ్రామంలో ఈ ఆలయం ఉంది. పూణె కు 65 km దూరంలో ఉన్న ఈ ఆలయంలో మయూర వహనదారుడైన వినాయకుని అష్ట వినాయక అవతారాలలో మొదటిది.
మయూరేశ్వరునిగా కొలువు ఉన్నందున ఈ గ్రామానికి మోర్ గావ్ అనే పేరు వచ్చింది.
త్రేతాయుగంలో సిందు అనే రాక్షసుడిని చంపడానికి మయూరేశ్వరునిగా అవతరించాడు.
2. సిద్ది వినాయక గణపతి ( సిద్దాటెక్)
కావలసిన కార్యాలను సిద్దింపజేస్తాడని అక్కడి వారి నమ్మకం.
అహ్మద్ నగర్ జిల్లా కర్ణత తాలూకాలో సిద్దాటెక్ గ్రామంలో భీమా నది ఒడ్డున ఈ క్షేత్రం ఉంది.
3. బల్లాలేశ్వర గణపతి
రాయగడ జిల్లా, సుదాగడ్ తాలూకా లోని పాలి అనే గ్రామంలో ఈ దేవాలయం ఉంది. వినాయకుని భక్తుడైన బల్లాలుని పేరుపై బల్లాలేశ్వర నామంతో ఇక్కడ వెలిశారు.
దేవాలయంలో స్వామి వారికే కాకుండా ఎదురుగా ఉన్న మూషిక వాహనం కి కూడా మొత్తం వెండి తొడుగు ఉంటుంది. ప్రతిరోజు సూర్యోదయం అవగానే సూర్య కిరణాలు ఈ విగ్రహం మీద పడతాయి. భాద్రపద శుద్ధ పౌర్ణమి నాడు మాఘ పాడ్యమి నాడు ఇక్కడ జరిగే ఉత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారు.
4. వరద వినాయక గణపతి (మధ్ మహడ్)
రాయగడ్ జిల్లా ఖాలాపూర్ తాలూకాలోని మహడ్ లో ఈ దేవాలయం ఉన్నది. కోరిన వరాలిచ్చే దేవుడిగా ఈయనకు పేరు.
ఈ ఆలయంలో నందా దీపం గత 115 సం. లుగా అఖండంగా వెలుగుతూనే వుంది. మాఘ శుద్ద చతుర్థి నాడు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుగుతుంది.
5. చింతామణి గణపతి ( థేవూర్ )
పూనా జిల్లాలోని థేవూర్ గ్రామం నందు మలి ముఠా నదీ తీరమున ఈ క్షేత్రం ఉంది.
చింతలు తొలగించే గణపతిగా ఈయనకి పేరు.
దేవాలయం లోకి వెళ్ళడానికి చిన్న ద్వారం ఉంటుంది. దాని గుండా లోపలికి వెళితే లోపల పెద్ద గుడి ఉంటుంది. ఈ మందిరం పీష్వాల కాలం నాటిది మొదటి పీష్వా మాధవరావు అతని భార్య అమ్మాయి పేరు మీద కార్తీక శుద్ధ అష్టమి రోజు ప్రత్యేకత ఉత్సవాలు జరుగుతాయి.
6. గిరిజాత్మక గణపతి
పూనా జిల్లా లోని జున్నర్ తాలూకాలో లేణ్యాద్రి గ్రామం నందు ఈ క్షేత్రం ఉంది. గిరిజాదేవి పుత్రుడైన వినాయకుడు ఈ క్షేత్రము నందు గిరిజాత్మకుడిగా పేరుపొందాడు.
ఈ దేవాలయం లేణ్యాద్రి పర్వతాలలో ఉంది కాబట్టి దాదాపు 3000 మెట్లు ఎక్కాలి.
ఈ దేవాలయం పూర్తి పురాతన పద్ధతిలో ఉంటుంది. దేవాలయం మానవ నిర్మితం కాదు. ప్రకృతి సహజంగా ఏర్పడినటువంటి కొండ గుహలో ఉంటుంది. ఇక్కడ స్వామివారి దివ్య దర్శనం అలౌకిక ఆనందాన్ని కలగజేస్తోంది. గృహ చుట్టూరా కొండలు దూరంగా పొలాలు అందమైన దృశ్యాలు ఉంటాయి.
7. విఘ్నేశ్వర గణపతి
కూకడీ అనే నదీ తీరాన పూనా జిల్లాలో జున్నర్ తాలూకాలో ఓజూర్ అనే గ్రామంలో ఈ క్షేత్రం ఉంది.
1958-1968 మద్య కాలంలో ఈ దేవాలయాన్ని బాగా అభివృద్ధి చేశారు.
విఘ్నాలను హరించే గణపతిగా ఈ స్వామి వారికి పేరు. ఆలయం చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ పురాతన రాతి కట్టడంతో ఉంటుంది. ఇక్కడ స్వామివారి రెండు కళ్ళు వజ్రాలతో పొదగ బడి ఉంటాయి.
8. మహాగణపతి (రంజన్ గాంవ్ )
అష్ట వినాయకులలో ఆఖరిది మహాగణపతి.
పూనా జిల్లాలో శిరూర్ తాలూకాలోని రంజన్ గాంవ్ లో ఈ క్షేత్రం ఉంది.
ప్రాచీన వాస్తు శాస్త్రం ప్రకారం ఈ దేవాలయాన్ని నిర్మించారు. సంక్రాంతి సందర్భంలో సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు సూర్యకిరణాలు ఈ స్వామివారి పై పడతాయి. గణపతి క్షేత్రాలలో ఈ దేవాలయం చాలా పెద్దది. ఇరవై తలలు, ఇరవై చేతులు గల మూల విరాట్ భూగర్భంలో ఉన్నదని, దానిని పోలిన మరో విగ్రహం భక్తుల దర్శనార్థం పైన ప్రతిష్టించారని చెబుతారు. మహ్మదీయ రాజుల కాలంలో దండయాత్రలకు బయపడి ఈ విధంగా చేశారని చెబుతారు.