దీపారాధనలో వత్తుల ప్రాముఖ్యత.., ఏ నూనెలు ఏ ఏ ఫలితాలు…, ఏ దిక్కులలో ఏ ఏ ఫలితాలో తెలుసుకుందాం…

1) ఒక_వత్తి : సామాన్య శుభం

2) రెండు_వత్తులు : కుటుంబ సౌఖ్యం

3) మూడు_వత్తులు : పుత్ర సుఖం

4) ఐదు_వత్తులు : ధనం, సౌఖ్యం, ఆరోగ్యం, ఆయుర్ధాయం , అభివృద్ధి. దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము.

1) నేతితో దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును.

2) నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగును.

3) ఆముదముతో దీపారాధన చేసిన దేదీప్య మానమగు జీవితం , బంధుమిత్రుల శుభం, దాంపత్య సుఖం వృద్ధి యగును.

4) వేరుశెనగ నూనెతో దీపారాధన చేసిన నిత్య ఋణములు, దుఖం, చోర భయం, పీడలు మొదలగునవి జరుగును.

5) నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , ఇప్ప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన వారికి దేవీ అనుగ్రహం కలుగును.

6) వేప నూనె, నెయ్యి , ఇప్ప నూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం.., ఇలవేల్పులకు సంతృప్తి కలుగును.

7) ప్రతిరోజు దీపారాధన ఉదయం మూడు గంటల నుండి ఆరు గంటలలోపు చేసిన సర్వ శుభములు, శాంతి కలుగును.

దీపాల యొక్క దిక్కుల_ఫలితములు

1) తూర్పు :

కష్టములు తొలగును, గ్రహ దోషములు పోవును.

2) పశ్చిమ :

అప్పుల బాధలు , గ్రహ దోషములు, తొలగును.

3) దక్షిణం :

ఈ దిక్కున దీపము వెలిగించరాదు. కుటుంబమునకు కష్టము కలుగును.

4) ఉత్తరం :

ధనాభివృద్ధి, కుటుంబము లో శుభ కార్యములు జరుగును.

దీపవత్తులయొక్క_ఫలితములు

1) పత్తి :

పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును

2) అరటినార :

ఆరటి నారతో దీపము వెలిగించినచో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును.

3) జిల్లేడు_నార :

జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత, ప్రేత, పిశాచాల బాధలు ఉండవు.

4) తామర_నార :

పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును.. ధనవoతులు అగుదురు.

5) నూతనపసుపువస్త్రము :

అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు.

6) నూతనఎరుపువస్త్రము :

వివాహాలు జరుగును , సంతానము కల్గును.

7) నూతనతెల్లవస్త్రము :

పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును..
సాయంత్ర సమయము లందు శ్రీ మహాలక్ష్మి కి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కల్గును .
జాతకం నందలి గ్రహస్థితి ఆధారంగా దీపారాధన చేసిన యెడల సత్పలితాలు కలుగును