డబ్బుతో ఏమైనా కొనగలమనుకుంటున్నారా…

అయితే కొనలేనివి ఇవిగో…

మంచం పరుపు కొనవచ్చు
కానీ నిద్ర కాదు

గడియారం కొనవచ్చు
కానీ కాలం కాదు

మందులు కొనవచ్చు
కానీ ఆరోగ్యం కాదు

భవంతులు కొనవచ్చు
కానీ ఆత్మేయిత కాదు

పుస్తకాలు కొనవచ్చు
కానీ జ్ఞానం కాదు

పంచభక్ష పరమాన్నాలు కొనవచ్చు
కానీ జీర్ణశక్తిని కాదు

మంచి మాట…

దెబ్బలు తిన్న రాయి
విగ్రహంగా మారుతుంది
కానీ దెబ్బలు కొట్టిన
సుత్తి మాత్రం ఎప్పటికీ
సుత్తిగానే మిగిలిపోతుంది….


ఎదురు దెబ్బలు తిన్నవాడు,
నొప్పి విలువ తెలిసిన వాడు
మహనీయుడు అవుతాడు
ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు
ఎప్పటికీ ఉన్నదగ్గరే ఉండిపోతాడు