Skip to content
- తూర్పుగాలి ఉప్పగా తియ్యగా ఉంటుంది. కఫ పైత్యాలను, వాత రోగాలను, ఉబ్బసాన్ని ఎక్కువ జేస్తుంది.
- ఆగ్నేయగాలి జిగటగా వేడిగా ఉండి, కళ్ళకు మంచి చేస్తుంది.
- దక్షిణగాలి మంచి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది.
- నైరుతిగాలి మేహాన్నీ తాపాన్ని పుట్టించి సర్వరోగాలకు కారణమవుతుంది.
- పశ్చిమగాలి వెగటుగా ఉండి, వేడిజేస్తుంది
- వాయువ్యగాలి కారంగా చేదుగా ఉంటుంది. దాహాన్నీ, తాపాన్ని పుట్టిస్తుంది. ఒంటిలోని నీరార్చి, కఫాన్నీ, పైత్యాన్ని తగ్గిస్తుంది.
- ఉత్తరగాలి చల్లగా ఉంటుంది. ధాతువులకు బలాన్ని కలుగజేస్తుందిగాని జలుబు చేస్తుంది.
- ఈశాన్యగాలి మధురంగా మనోహరంగా ఉంటుంది. జలుబును, కఫాన్ని పోగొడుతుంది. ఆకలి పుట్టిస్తుంది.