మనిషికి మరణం ఉంటుంది కాని మంచితనానికి కాదు…

◼️ ప్రపంచంలో దాచుకొని తినే జీవులు బుద్ది చాలా ఉంటాయి, కాని పక్కవాడిని దోచుకుని తినే బుద్ది ఉన్న జీవి మాత్రం మనిషి ఒక్కడే…

 ◼️ పాలు, కల్లు రెండు తెల్లగానే ఉన్నా అవి మనిషి మీద చూపే ప్రభావం వేరు వేరుగా ఉంటుంది.

 ◼️ మనుషులు అందరూ ఒకేలా ఉన్నా వారు చేసే పనులు, ప్రవర్తన వేరు వేరుగా ఉంటాయి.

◼️ మనిషి కన్నా విలువైనది మనసు…
ఆవేశం కన్నా విలువైనది ఆలోచన…
కోపం కన్నా విలువైనది జాలి…
స్వార్థం కన్నా విలువైనది య త్యాగం…
వీటన్నంటి కంటే విలువైనది స్నేహం…

  ◼️ మనం కష్టపడాలన్నా ఈ క్షణమే…
మనం ఆనందించాలన్నా ఈ క్షణమే..
మనం బ్రతకాలన్నా ఈ క్షణమే…
బ్రతికించాలన్నా ఈ క్షణమే…

◼️ ఎందుకంటే నిన్న నీది కాదు గడచిపోయింది…
రేపు నీది కాదు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ఈ క్షణమే నీది…

 ◼️ నేనే అనే అహంకారం ఉంటే నీతోనే నువ్వు పతనం అవుతావు.
మనం అనే ప్రేమ ఉంటే నీతో పాటు అందరూ ఉంటారు.
వ్యక్తులు శాశ్వతం కాదు వ్యవస్థ శాశ్వతం…
అధికారం శాశ్వతం కాదు ఆప్యాయత శాశ్వతం…

 ◼️ నోటిలో నుంచి వచ్చే మాటని అదుపు చేయ గల వాళ్ళు ప్రపంచంలో దేనినైన జయించ గలగుతారు.

◼️ మాట చాలా శక్తి వంతమైనది, చెడ్డ పని కన్నా చెడ్డ మాట చాలా ప్రమాదకరమైనది.