శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహాన్ని దర్శించాలంటే ఆరు ద్వారములు దాటి ఆపై వచ్చే ఏడవ ద్వారం అవతల గర్భగుడిలోని శ్రీవేంకటేశ్వరుని దర్శిస్తున్నాము.

దాని పరమార్ధం మనలో ఉన్న బ్రహ్మనాడిలో ఏడు కేంద్రములున్నాయి. జీవుడు ఆత్మను చేరాలంటే ఏడవస్థానానికి చేరాలి. అందుకే స్వామి నేను ఏడవగదిలో ఉన్నాను. నన్ను చేరాలంటే మీలో ఉన్న ఏడు ద్వారములు దాటండి. అప్పుడు నా రూపాన్నీ, ఆంతర్యాన్ని చూడగలరు అనేది స్వామి దర్శనంలో పరమార్ధం.