ఆంధ్రప్రదేశ్‌లో దసరా సెలవులు ముందుకు మార్చాలని ఎమ్మెల్సీ గోపికృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం 24 నుంచి సెలవులు ఉన్నా, పండుగ 22 నుంచే మొదలవుతుందని గుర్తు చేశారు.

డీఎస్సీ నియామకాలకు ముందే అంతర్ జిల్లా బదిలీలు, పెండింగ్‌లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లు పూర్తి చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు.