అరిషడ్వర్గాలు అంటే ‘కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు’ అనే ఆరింటిని కలిపి అరిషడ్వర్గాలు అని అంటారు.
ఈ అరిషడ్వర్గాలు అనేవి మనిషిని ఎంతటి క్రింది స్థాయికైన దిగాజారుస్తాయి. మనిషి పతనానికి మరియు ప్రకృతి వినాశనానికి కూడా ముఖ్య కారణం ఈ అరిషడ్వర్గాలే.
ఈ అరిషడ్వర్గాలు ఎవరైతే కలిగి ఉంటారో వారి మనసు ఎప్పుడు స్వార్ధం మరియు సంకుచిత భావాలే ఎక్కువగా కలిగి ఉంటాయి. దుఃఖానికి ఇవి మొదటి హేతువులు.
ఈ అరిషడ్వర్గాల గురించి వివరంగా తెలుసుకుందాం…
కామము
కామము అంటే కోరిక. ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన కోరికలు కలిగి యుండడము.
క్రోధము
క్రోధము అంటే కోపము. ఇది కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని వారిపై ప్రతీకారము తీర్చుకోవాలని ఉధ్రేకముతో నిర్ణయాలు తీసుకోవడము.
లోభము
లోభము అంటే కోరికతో తాను సంపాదించుకున్నది, పొందినది తనకే కావాలని పూచిక పుల్ల కూడా అందులోనుండి ఇతరులకు చెందగూడదని దానములు, ధర్మకార్యములు చేయకపోవడము.
మోహము
తాను కోరినది కచ్చితముగా తనకే కావాలని, ఇతరులు పొందకూడదని అతి వ్యామోహము కలిగి యుండడము, తాను కోరినది ఇతరులు పొందితే భరించ లేకపోవడము.
మదము
మదము అంటే అహంకారం. ఇది తాను కోరిన కోరికలన్ని తీరుట వల్ల తన గొప్పతనమేనని గర్వించుతూ మరియెవ్వరికి ఈ బలము లేదని ఇతరులను లెక్కచేయక పోవడము.
మాత్సర్యము
తాను గలిగియున్న సంపదలు ఇతరులకు ఉండగూడదని తనకు దక్కనిది ఇతరులకు దక్కకూడదని, ఒకవేళ తను పొందలేని పరిస్థితిలో ఆ వస్తువు ఇతరులకు కూడా దక్కకూడదనే ఈర్ష్య కలిగి యుండడము.
అరిషడ్వర్గాలు అంటే ఏమిటో తెలుసుకున్నాము. వీటిని మనం అదుపులో ఉంచితేనే మనం అనుకున్న స్థాయికి చేరుతాము లేకపోతే వీటి బారిన పడి మనం పతనం అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. వీటిని జయించాలి (లేక అదుపులో ఉంచడం) అంటే ముఖ్యమైన ఆయుధం భగవంతుని సత్యమైన దివ్యమైన జ్ఞానం మాత్రమే. ఆ దేవదేవుని జ్ఞానం ఎపుడు పొందుతామో (తెలుసుకుంటామో), అప్పుడు అరిషడ్వర్గాలు అన్నియు సమస్తము మన మనసు నుండి సర్వం నశించిపోతాయి.
ఇవి కూడా చదవండి…
- TRVKS జెన్కో కార్యదర్శిగా ఎన్నికైన ముత్యాల రాంబాబు
- ఎస్బీఐలో 10 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల – అక్టోబర్ 28లోపు దరఖాస్తు చేయండి
- రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల 69 వేల192 మహిళా శక్తి చీరల పంపిణీ
- బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం – హైడ్రా చర్యలు సంచలనం
- మధ్యప్రదేశ్‌లో మాజీ చీఫ్ ఇంజనీర్ అవినీతి గూటి బట్టబయలు – కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం
- నోబెల్ శాంతి బహుమతికి మరియా కొరినా మచాడో ఎంపిక – ట్రంప్‌కు నిరాశ
- రాష్ట్రవ్యాప్తంగా బంద్‌కు బీసీ సంఘాల పిలుపు – రిజర్వేషన్ల అమలుపై ఆర్.కృష్ణయ్య డిమాండ్
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- అరిషడ్వర్గాలు అంటే ఏమిటి? వాటి అర్థం మరియు ప్రభావం
- తిరుపతిలో ప్రతి రోజు సర్వదర్శనం టోకెన్ ఇచ్చే ప్రదేశాలు
- తిరుమలకు వచ్చే భక్తులకు తరచూ వచ్చే ప్రశ్నలు… వాటి సమాధానాలు…
- భక్తులకు అందుబాటులో టిటిడి 2026 డైరీలు, క్యాలెండర్లు
- నేటి మంచి మాట
- నేటి రాశి ఫలాలు అక్టోబర్ 11, 2025
- నేటి పంచాంగం అక్టోబర్ 11, 2025
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం
- దేవి నవరాత్రుల పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమం
- ఈవీఎం గోడౌన్ ను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.
- ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 58వ వర్ధంతి.
- జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం.
- డి హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్ గవాయ్ పై జరిగిన దాడిని ఖండిస్తూ ప్లకార్డులతో నిరసన.