< 1 Min

మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:22 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని మెయిన్ బజార్ ఏరియాలో ఉన్న దుర్గా దేవి ఆలయంలో జమ్మూ కాశ్మీర్ లోని త్రికూట పర్వతంలో కొలువుదీరిన వైష్ణో దేవీ ఆలయం నుండి తీసుకువచ్చిన వైష్ణో దేవీ స్వరూప జ్యోతి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ భక్తుల కోరికలను తీరుస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతుంది.

దుర్గా మాత ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో ప్రతి ఏటా చైత్ర మాసంలో ఉగాది నవరాత్రి ఉత్సవాలు, అశ్విని మాసంలో శారదీయ దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు.

తొమ్మిది రోజులు నవ దుర్గా అమ్మవారిని తొమ్మిది రూపాల్లో అలంకరిస్తారు. ప్రతి రోజు ఉదయం సాయంత్రం అమ్మవారి భజన సంకీర్తనలు హారతి కార్యక్రమం నిర్వహిస్తారు. అమ్మ వారి దేవాలయంలో వైష్ణో దేవి జ్యోతి స్వరూపంలో ప్రత్యక్షంగా దర్శనమిస్తున్న అమ్మవారిని నిర్మలమైన మనసుతో మనస్పూర్తిగా ఎలాంటి కోరిక కోరినా, మొక్కిన మొక్కలు పూర్తవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం.