< 1 Min

మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:16 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే,

బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలోని రామటాకిస్ ప్రక్కన దశాబ్దాలుగా చెత్తకు నిలయమైంది. ఈ విషయంపై అక్కడి నాయకులు పలుమార్లు పిర్యాదులు చేస్తున్నా, శాశ్వత పరిష్కారం మాత్రం లభించలేదు.

ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ వినూత్నంగా అక్కడి చెత్తను తొలగించి, అక్కడ ఒక జరిమానాలతో కూడిన హెచ్చరిక పెయింటింగ్ ఏర్పాటు చేసారు. ఇక మీదట చెత్త వేసే వారు హెచ్చరిక బోర్డు చూసి చెత్త వేయడం మానివేస్తారా వేచి చూడాలి.