< 1 Min

సుప్రీం కోర్టులో అప్రతిష్టకర ఘటన: సీజేఐ బీఆర్. గవాయ్‌పై న్యాయవాది దాడి

సుప్రీం కోర్టులో సీజేఐ బీఆర్ గవాయ్‌పై న్యాయవాది దాడికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. “సనాతన్ కా అప్మాన్ నహీ సహేంగే” అని అరుస్తూ న్యాయవాది కిషోర్ రాకేష్ షూ విసిరేందుకు యత్నించగా, భద్రతా సిబ్బంది వెంటనే అడ్డుకున్నారు.

అనంతరం అతనిని కోర్టు వెలుపలికి తీసుకెళ్లారు. సీజేఐ గవాయ్ అయితే స్థిరంగా స్పందించి విచారణ కొనసాగించారు. ఈ ఘటనకు నేపథ్యం ఖజురాహో విష్ణు విగ్రహంపై సీజేఐ చేసిన వ్యాఖ్యలు కావొచ్చని చెబుతున్నారు. విచారణలో గవాయ్ ‘‘విష్ణువుని ప్రార్థించండి’’ అంటూ చేసిన వ్యాఖ్యలు హిందూ సమాజంలో ఆగ్రహాన్ని రేపాయి.

పలువురు న్యాయవాదులు సీజేఐ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ లేఖలు రాశారు. సుప్రీం కోర్టు న్యాయస్థానం కావడంతో దేశ ప్రజల మతపరమైన విశ్వాసాలను గౌరవించాలని వారు కోరారు.