< 1 Min

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
రామవరం,
అక్టోబర్ 9,2025
✍️దుర్గా ప్రసాద్

మహా అన్నప్రసాద కార్యక్రమాలు మనలో ఐక్యతను, ప్రేమాభిమానాలను పెంపొందించడంలో దోహద పడతాయని. సింగరేణి ప్రాంతంలో కార్మికుల ఐక్యతకు ఇవి నిదర్శనాలని కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలెం రాజు అన్నారు.

దేవి నవరాత్రుల పర్వదినాలను పురస్కరించుకొని సింగరేణి కొత్తగూడెం ఏరియా పరిధిలోని రుద్రంపూర్ ఎస్ అండ్ పిసి డిపార్ట్మెంట్ కార్యాలయంలో లో నెలవైవున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం ప్రాంగణంలో ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఉదయం మొదలైన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు.

అమ్మవారి కృపకు కృతజ్ఞతగా ప్రతి సంవత్సరం నవరాత్రులలో అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. భక్తులకు ప్రసాదంగా వడ్డించిన అన్నసమయాల్లో శుద్ధత, నాణ్యతకు పెద్ద పీట వేశారు.భక్తులు అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించి అనంతరం ప్రసాదం స్వీకరించారు.

ఈ యొక్క కార్యక్రమంలో ఎస్ ఓటు జిఎం కోటి రెడ్డి , ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ . అభిలాష్, సివిల్ ఏజీఎం సిహెచ్ రామకృష్ణ, ఎఐటియుసి బ్రాంచి సెక్రటరీ గట్టయ్య జూనియర్ ఇన్స్పెక్టర్ టి. వెంకటేశ్వర్లు , సీనియర్ అసిస్టెంట్ మోహన్ రెడ్డి , జమేదర్ జయరాజు , కే కుమార్ , ఎఐటియుసి ఫిట్ సెక్రటరీ జితుకు రాంబాబు , ఏరియా ఇంటెలిజెన్స్ మల్లికార్జున్, జనార్ధన్, టెంపుల్ కమిటీ పిట్టల చంద్రమోహన్ సీతారాం , రమేష్ బాబు , కోడి నవీన్ , విజయకుమార్ , లక్ష్మణ్ రావు , వాసిరెడ్డి సురేష్ , ప్రైవేటు సూపర్వైజర్ సుంకరి శ్రీనివాస్ , గుళ్ళ ఈశ్వరరావు , ప్రైవేట్ గార్డ్స్ టి కిరణ్ , బానోత్ కృష్ణ , బానోత్ రవి , చిలక నాగేష్ , ఆర్ మురళి , ఏరియా అధికారులు, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.