< 1 Min

డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్

పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్ ) పాల్వంచ నందు హిందీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం లభించింది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన రుషి వైదిక విద్యాపీఠం వారు ఆమెకు ఈ అవార్డును అందజేశారు.

ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి దేశ సేవ, సమాజ సేవ, విద్యా సేవ, పరిశోధన, సాహిత్య రంగాలలో అత్యున్నత సేవలు చేసిన వారికి ఈ అవార్డు ప్రదానం చేయబడుతుంది. జాతీయ స్థాయిలో వందకు పైగా అభ్యర్థులు ఈ అవార్డు కోసం ప్రతిపాదనలు పంపించారు.

రెండు వడపోతల అనంతరం తెలంగాణ రాష్ట్రం నుండి డాక్టర్ టి.అరుణ కుమారి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. హిందీ భాషా అభ్యున్నతి కోసం, హిందీ విద్యార్థుల అభివృద్ధి కోసం మరియు హిందీ సాహిత్య- భాషా రంగాలలో ఆమె నిర్వహిస్తున్న పరిశోధనల కోసం ఆమెను ఈ అవార్డుకు ఎంపిక చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఆమెకు ఒక మెడల్ మరియు ప్రశంసా పత్రం అందజేయబడింది. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి. పద్మ గారు ఆమెను మరొకసారి కళాశాల అధ్యాపక, అధ్యాపకేతర, విద్యార్థి బృందం తరఫున శాలువతో సన్మానించారు. గతం లో రాష్ట్రస్థాయిలో స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకున్న డాక్టర్ టి.అరుణ కుమారి గారికి ఈనాడు జాతీయస్థాయిలో ఇటువంటి అవార్డు లభించడం కళాశాలకు ఎంతో గర్వకారణం అని పలువురు ఆమెను ప్రశంసించారు.