భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు
✍️దుర్గా ప్రసాద్

ఈ రోజు మణుగూరు మండలంలో గౌరవనీయులైన DRDO మేడమ్ గారు పర్యటించారు. పర్యటనలో భాగంగా మండల పరిధిలో జరుగుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.

తొగ్గుడెంలో ఏర్పాటు చేసిన సర్క్యులేటరీ ఆక్వా సిస్టమ్, కొరామీను చేపల పెంపకం కేంద్రాన్ని పరిశీలించి, చేపల పెంపకానికి ఆధునిక పద్ధతులు ఉపయోగించడం పై సంతోషం వ్యక్తం చేశారు.

కూనవరం గ్రామంలో సాగుతున్న మోరింగా (మునగ) తోటల అభివృద్ధి పనులను పరిశీలించి, రైతులకు ఆర్థికంగా తోడ్పడే ఈ పంట విస్తరణపై సూచనలు అందించారు.

మున్సిపాలిటీ పరిధిలోని IKP సంఘాల గోదాంను, అలాగే SHG మహిళా సభ్యులకు అందిస్తున్న యూనిఫాం చీరల పంపిణీ వ్యవస్థను పరిశీలించారు.

రామానుజవరం గ్రామంలో నిర్మించిన పశువుల కట్టడాన్ని సందర్శించి, పశుసంవర్ధకంలో దీని ప్రాధాన్యతను వివరించారు.

అనంతరం మేడమ్ గారు IKP, MGNREGS కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు పనితీరు నివేదికలను సమర్పించారు.

ఈ పర్యటనలో APM, APO, MPO, MEOలతో పాటు అన్ని మండల స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతి కార్యక్రమం స్థాయిలో ఫీల్డ్‌ లెవెల్ స్టాఫ్ కృషిని మేడమ్ అభినందించారు.