మీరు ఈఎంఐపై ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే జాగ్రత్త! రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొత్త నిబంధనను పరిశీలిస్తోంది.

సకాలంలో వాయిదాలు చెల్లించని కస్టమర్ల ఫోన్‌లను బ్యాంకులు, రుణ సంస్థలు రిమోట్‌గా లాక్ చేసే అవకాశం ఉందని సమాచారం. వినియోగదారుల ప్రయోజనాలు కాపాడుతూ, బ్యాంకుల మొండి రుణాలను తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. గతంలో ఇలాంటి ప్రతిపాదనను ఆర్బీఐ అడ్డుకున్నప్పటికీ, పెరుగుతున్న నిరర్థక రుణాల నేపథ్యంలో ఇప్పుడు అనుమతి ఇవ్వవచ్చని తెలుస్తోంది.

తొలుత బ్యాంకులు, రుణ సంస్థలతో చర్చించి మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. అయితే ముందుగానే కస్టమర్లకు ఫోన్-లాకింగ్ నిబంధనపై స్పష్టమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.