< 1 Min

మంచిర్యాల జిల్లా కేంద్రం
తేదీ:16 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

మంచిర్యాల: ఎగువ ప్రాంతాల నుండి గోదావరి నదిలో నీరు చేరుతున్న దృష్ట్యా నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.

మంగళవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్ రోడ్డులో గల గోదావరి నది తీర ప్రాంతాన్ని మండల తహసిల్దార్ రఫతుల్లా తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎగువ ప్రాంతాలలో వర్షం కురుస్తున్నందున ప్రాజెక్టుల నుండి వరద నీరు గోదావరి నదిలోకి చేరుతుందని, ఈ నేపథ్యంలో నీటి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు.

ఇందు కొరకు పోలీస్, మున్సిపల్ శాఖల నుండి సిబ్బందిని నియమించి గోదావరి నది తీర ప్రాంతంలో నీటి పరిస్థితిని పర్యవేక్షించేలా చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ ను ఆదేశించారు. అనంతరం మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల ప్రాంతంలో కొనసాగుతున్న ఇందిరా మహిళ భవన్ నిర్మాణ పనులను పరిశీలించారు.

పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా అధికారులు గుత్తేదారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.