< 1 Min

Healthy Hair Diet :
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సరైన పోషకాహారం చాలా ముఖ్యం. పోషకాలు తగినంతగా అందకపోతే జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. క్యారెట్‌లోని విటమిన్ A జుట్టుకు తేమను అందించి మెరిసేలా చేస్తుంది. చిలకడదుంపలో బీటా కెరోటిన్ అధికంగా ఉండి జుట్టు పొడిబారకుండా కాపాడుతుంది. పాలకూర, గోంగూర వంటి ఆకుకూరల్లో ఐరన్, విటమిన్ A, C, ఫోలేట్ లాంటి పోషకాలు ఉండి జుట్టు రాలకుండా కొత్తగా పెరిగేలా చేస్తాయి. ఓట్స్‌లో జింక్, ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్లు ఉండి జుట్టు బలంగా పెరిగేలా చేస్తాయి. గుడ్లలోని ప్రోటీన్, బయోటిన్ జుట్టు వృద్ధికి సహాయపడతాయి. పాలు, పెరుగు, బాదం, చీజ్ వంటి ఆహారాల్లోని కాల్షియం జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వాల్‌నట్, ఆలివ్ ఆయిల్‌లోని ఒమేగా-3 జుట్టు పట్టు కోల్పోకుండా ఆరోగ్యంగా ఉంచుతుంది. ప్రతి రోజు సరైన ఆహారం తీసుకోవడం ద్వారా జుట్టు బలంగా, మెరిసేలా, ఆరోగ్యంగా ఉంటుంది.