భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
సింగరేణి
సెప్టెంబర్ 11,2025
✍️దుర్గా ప్రసాద్

కొత్తగూడెం ఏరియా డబ్ల్యూపిఎస్ & జి‌ఏ వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2025 సెప్టెంబర్ 12 నుండి 14 సెప్టెంబర్ వరకు జరిగే వివిధ డెపార్ట్మెంటల్ పోటీల వివరములను కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు ఒక ప్రకటనలో తెలియజేశారు.

బాస్కెట్ బాల్ క్రీడా 2025 సెప్టెంబర్ 12ఉదయం 10.00గంటలకు, సిఈఆర్ క్లబ్, కొత్తగూడెం నందు లాన్ టెన్నిస్ క్రీడా 2025 సెప్టెంబర్ 13 ఉదయం 10.00గంటలకు, లాన్ టెన్నిస్ కోర్ట్, గౌతంపూర్ నందుబాడీ బిల్డింగ్, పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్ క్రీడలు -2025 సెప్టెంబర్ 14, ఉదయం 09.00గంటలకు, ప్రకాశం స్టేడియం, కొత్తగూడెం నందు నిర్వహించడం జరుగుతుంది.

పై తెలిపిన క్రీడలలో పాల్గొనదలచి ఆసక్తి కలిగిన క్రీడాకారులు స్పోర్ట్స్ కోఆర్డినేటర్ అలాగే సంబంధిత జనరల్ కెప్టెన్ ని సంప్రదించుకొని క్రీడలలో పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

క్రీడాకారులందరూ క్రీడా స్ఫూర్తితో ఆటలు ఆడాలని, కొత్తగూడెం ఏరియాకి రీజనల్ లెవెల్, కంపెనీ లెవెల్, కోల్ ఇండియా లెవెల్ పాల్గొని అధిక సంఖ్యలో బహుమతులు గెలచి, కొత్తగూడెం ఏరియా ప్రతిభ చూపాలని, అలాగే ఉద్యోగులు ఇటువంటి ప్రమాదాలు (దెబ్బలు) తగిలించుకోకుండా పాల్గొనాలని ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ప్రత్యేక పిలుపునిచ్చారు.