< 1 Min

దేశవ్యాప్తంగా ఈరోజు నుంచి LPG సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. చమురు కంపెనీలు 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధరను రూ.5 తగ్గించాయి. ఈ కొత్త ధరలు నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చాయి.

IOCL ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల సిలిండర్ ధర రూ.1,595.50 నుంచి రూ.1,590.50కి తగ్గింది. అయితే 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు.

దేశంలోని ప్రధాన నగరాల్లో వాణిజ్య LPG సిలిండర్ ధరలు — ముంబైలో రూ.1,542, కోల్‌కతాలో రూ.1,694, చెన్నైలో రూ.1,750గా ఉన్నాయి. పాట్నా, నోయిడా, లక్నోలో రూ.1,876, గురుగ్రామ్‌లో రూ.1,607కి లభిస్తోంది. ఈ సిలిండర్లు సాధారణంగా హోటళ్ళు, రెస్టారెంట్లు, వాణిజ్య సంస్థలు ఉపయోగిస్తాయి.

అయితే గృహ వినియోగ వంట గ్యాస్ ధర యథాతథంగానే ఉంది. ఢిల్లీలో రూ.853, ముంబైలో రూ.852.50, చెన్నైలో రూ.868.50, హైదరాబాద్‌లో రూ.905గా కొనసాగుతోంది. LPG ధరలతో పాటు విమాన ఇంధన ధరల్లో కూడా స్వల్ప మార్పులు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి…