< 1 Min

మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:17 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: బీజేపీ నాయకులు కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో బుధవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా స్థానిక శిశు మందిర్ పాఠశాల విద్యార్థుల తో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి కేకును కోసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, నరేంద్ర మోదీ ప్రధాని కావడం భారత దేశ ప్రజల అదృష్టమని, భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. భారత దేశం పట్ల ఆయన అంకిత భావనతో చేపడుతున్న నిర్ణయాలను ప్రజలు స్వాగతిస్తున్నారని అన్నారు. అనంతరం పిల్లలకు స్వీట్స్,చాక్లెట్లు పంచారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అమురాజుల శ్రీదేవి, పట్టణ అధ్యక్షురాలు దార కళ్యాణి, అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాజులాల్ యాదవ్, సీనియర్ నాయకులు పులగం తిరుపతి, గోవర్దన్, అమురాజుల రాజేశ్వర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు శనీగారపు శ్రావణ్, ఎస్సీ మోర్చ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్, నాయకులు రాములు, తదితరులు పాల్గొన్నారు.