డెహ్రాడూన్: ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గురువారం ఉత్తరాఖండ్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ సందర్భంగా వరద ప్రభావిత ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే చేసి, తర్వాత ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులపై పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఇప్పటికే జోలీ గ్రాంట్ ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. ఇటీవల ఉత్తరాది రాష్ట్రాలైన హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో వరదలు ముంచెత్తాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధాని మోడీ రాష్ట్రాల వారీగా పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.