< 1 Min

మంచిర్యాల జిల్లా,
తాండూర్,
తేదీ:16 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

ఘనంగా ఇంజినీర్స్‌ డే వేడుకలు

తాండూర్: మోక్షగుండం విశ్వేశరయ్య జయంతి సందర్బంగా మంగళవారం వాసవి క్లబ్,తాండూర్, వాసవి వనిత సింధూర్ క్లబ్ ఆధ్వర్యంలో తాండూర్ మండల కేంద్రంలో ఇంజినీర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా మండలంలోని హౌసింగ్ ఏఈ నక్కల కావ్య పంచాయతీ రాజ్ ఏఈ తూర్పటి సాయి లత లకు పూల మొక్కలు అందించి శాలువాతో సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వాసవి క్లబ్స్ జిల్లా కార్పోరేటివ్ వైస్ చైర్మన్ వాసవియన్ గోల్డెన్ స్టార్ కెసిజిఎస్ సంతోష్ కుమార్, వాసవి క్లబ్ అధ్యక్షులు మధుసూదన్, మాజీ అధ్యక్షులు కాసం భాస్కర్, వాసవి వనిత సింధూర్ క్లబ్ కార్యదర్శి మాధురి, కోశాధికారి కల్పన, సభ్యులు సాయి కృష్ణ, పుల్లూరి సంతోష్, కాసం సునీత, లింగ సంతోషిని, బోనగిరి స్పందన, కాసనగొట్టు సాయి, కృప కొంకుముట్టి సాహితి, చిలువేరు సునీత, తదితరులు పాల్గొన్నారు.