నేపాల్‌లోని పలు జైళ్ల నుంచి వేలాది ఖైదీలు పారిపోవడంతో తీవ్ర కలకలం రేగింది. సింధూలిగఢీ జైలులో 471 మంది, నవాల్‌పరాసీ వెస్ట్ జైలు నుంచి 500 మంది, నౌబస్తా బాల సదనం నుంచి 76 మంది మైనర్లు పరారయ్యారు.

ఈ ఘటనలో ఐదుగురు మైనర్లు మృతి చెందారు. మృతుల కుటుంబాలు, మానవ హక్కుల సంస్థలు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి. కొందరు ఖైదీలు భారత సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించగా, యుపి సిద్ధార్థనగర్ జిల్లాలో ఐదుగురిని ఎస్ఎస్‌బీ అదుపులోకి తీసుకుంది.