పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
పాల్వంచ రూరల్
సెప్టెంబర్ 11, 2025
✍️ దుర్గాప్రసాద్

పాల్వంచ మండలం ఉలవనూరు గ్రామానికి చెందిన కరకపల్లి దీప్తి మరణం, రేగులగూడెం గ్రామానికి చెందిన వజ్జా బాబు హార్ట్ ఎటాక్‌తో మరణం పట్ల భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నాయకులు నివాళులర్పించారు.

పాల్వంచ మండల కార్యదర్శి కామ్రేడ్ వీసంశెట్టి పూర్ణచంద్రరావు, జిల్లా నాయకులు, కామ్రేడ్ నిమ్మల రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి వేములపల్లి శ్రీనివాసరావు, రైతు సంఘం మండల అధ్యక్షుడు కొంగర అప్పారావు, ఉలవనూరు గ్రామ శాఖ కార్యదర్శి నిట్టా అమృత రావు తదితరులు పాల్గొన్నారు.