< 1 Min

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రెస్ క్లబ్ వెల్ఫేర్ ట్రస్ట్ అధ్యక్షుడు రత్నకుమార్ ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్ సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా అధ్యక్షుడు రత్నకుమార్ మాట్లాడుతూ… ప్రజాసమస్యలపై ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్య పరచడంలో పాత్రికేయులు ప్రధాన భూమిక పోషిస్తున్నారని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలను ఎలా ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయో సమగ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

మీడియా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండాలని, ప్రజల సమస్యలను నిబద్ధతతో వెలుగులోకి తేవాలని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు గోపి, సతీష్, బరిగెల భూపేష్, మనోజ్, బాలకృష్ణ, దుర్గాప్రసాద్, రబ్బానీ, రిషి, పాల్గుణ, శ్రీమన్నారాయణ, వాసు, తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.