< 1 Min

సౌదీ అరేబియాలో ఘోరమైన బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న భారతీయ ఉమ్రా యాత్రికుల బస్సు డీజిల్ ట్యాంకర్‌ను ఢీకొడంతో భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

ఈ ప్రమాదంలో 42 మంది సజీవదహనమైందని స్థానిక వర్గాలు చెబుతున్నాయి. మృతుల్లో ఎక్కువ మంది భారతీయులేనని, వారిలో హైదరాబాద్‌కు చెందినవారు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. 20 మహిళలు, 11 చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటన బదర్–మదీనా మధ్య ముఫ్రిహాత్ ప్రాంతంలో, అర్ధరాత్రి 1.30 సమయంలో జరిగింది. ప్రమాద సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నట్లు తెలిసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే అధికారుల నుంచి ఇంకా పూర్తిస్థాయి ప్రకటన వెలువడాల్సి ఉంది.