స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 10 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మేనేజర్ 6, డిప్యూటీ మేనేజర్ 3, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ 1 పోస్టులు ఉన్నాయి.
అభ్యర్థులు సంబంధిత విభాగంలో పీజీ, ఎంబీఏ లేదా పీజీడీబీఎం ఉత్తీర్ణతతో పాటు అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి ఆగస్టు 8, 2025 నాటికి మేనేజర్ పోస్టులకు 24–36 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్ పోస్టులకు గరిష్టంగా 30 ఏళ్లు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పోస్టులకు 35–45 ఏళ్ల మధ్యగా ఉండాలి. అక్టోబర్ 28, 2025లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 రుసుము చెల్లించాలి; ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపికైన వారికి నెలకు రూ.64,820 నుండి రూ.1,35,020 వరకు జీతం ఉంటుంది.