స్వీడన్‌లో కొత్తగా ఆరోగ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎలిసబెట్ లాన్ మీడియా సమావేశంలో అకస్మాత్తుగా కుప్పకూలారు. ఈ సంఘటన అక్కడున్న వారిని తీవ్రంగా భయపెట్టింది.

48 ఏళ్ల లాన్, ప్రధానమంత్రి ఉల్ఫ్ క్రిస్టర్సన్, పార్టీ నాయకురాలు ఎబ్బా బుష్‌లతో కలిసి జర్నలిస్టులతో మాట్లాడుతుండగా ఒక్కసారిగా ముందుకు పడిపోయారు. వెంటనే అధికారులు, మీడియా ప్రతినిధులు సహాయం చేశారు.

తక్కువ సమయంలోనే కోలుకున్న లాన్, రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం వల్ల ఈ ఘటన జరిగిందని తెలిపారు. ఇటీవలే అంకార్ బర్గ్ జోహన్సన్ రాజీనామా చేయడంతో లాన్ ఆరోగ్యమంత్రిగా నియమితులయ్యారు.