< 1 Min

మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:17 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించారు.

పాత బస్టాండ్ వద్ద పట్టణ అధ్యక్షురాలు దారా కళ్యాణి, తాండూరు మండలంలోని మార్కెట్ వద్ద మండల అధ్యక్షులు భరత్ కుమార్, మోడీ నగర్ లో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి జెండాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంచారు.

అనంతరం మార్కెట్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజి మాట్లాడుతూ…, నిజాం నిరoకుశ పాలన నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ తెలంగాణ ప్రాంతానికి విముక్తి కల్పించి భారత దేశంలో విలీనం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అధికారికంగా జరపడం లేదన్నారు. బిజెపి అధికారంలో వస్తే విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు భరత్ కుమార్, జిల్లా కార్యదర్శి మహేందర్ గౌడ్, సీనియర్ నాయకులు పులగం తిరుపతి, శేషగిరి, పట్టణ అధ్యక్షురాలు కళ్యాణి, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రావణ్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు శీతల్, మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్, విఘ్నేష్,ప్రదీప్, చరణ్,విజయ్,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.