అమెరికా అధ్యక్షుడు ట్రంప్, భారత్–చైనా రష్యన్ క్రూడ్ కొనుగోళ్లు నిలిపివేయాలని ఒత్తిడి తెస్తున్నారు. ఇందుకోసం యూరోపియన్ యూనియన్‌ను కూడా తన వ్యూహంలో భాగస్వామ్యం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

టారిఫ్‌లను 100 శాతం వరకు పెంచవచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. భారత్, చైనా వెనక్కి తగ్గకపోతే సుంకాలు కొనసాగుతాయని అమెరికా చెబుతోంది. ఇదంతా పుతిన్‌పై ఒత్తిడి పెంచి ఉక్రెయిన్ యుద్ధం ముగించడమే లక్ష్యంగా కనిపిస్తోంది.

SCO శిఖరాగ్ర సమావేశంలో మోడీ, జిన్‌పింగ్, పుతిన్ కలిసిన తర్వాత ట్రంప్ మరింత ఆందోళనకు గురై, ఇండియాను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రస్తుత పరిణామాలు సూచిస్తున్నాయి.