రియల్ మనీ గేమింగ్‌పై భారత ప్రభుత్వం నిషేధం ప్రకటించడంతో గేమింగ్ రంగంలో ఉద్యోగుల తొలగింపులు మొదలయ్యాయి.

తాజాగా జుపే గేమింగ్ కంపెనీ 170 మంది ఉద్యోగులను లేఆఫ్ చేస్తున్నట్లు తెలిపింది. ఇది కంపెనీ ఉద్యోగుల్లో సుమారు 30 శాతం మందిని ప్రభావితం చేయనుంది. కొత్త చట్టపరమైన నియమాలను అనుసరించేందుకు వ్యూహాత్మక వ్యాపార పునర్రూపకల్పనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ వెల్లడించింది.

లేఆఫ్ అయిన ఉద్యోగులకు ఆర్థిక సాయం, ఏడాది పాటు హెల్త్ ఇన్సూరెన్స్, రూ.1 కోటి విలువైన మెడికల్ సపోర్ట్ ఫండ్ అందజేస్తోంది. భవిష్యత్తులో కొత్త అవకాశాలు వచ్చినప్పుడు వీరిని మళ్లీ నియమిస్తామని కంపెనీ హామీ ఇచ్చింది.

ఇకపై జుపే ఆన్‌లైన్ సోషల్ గేమ్స్, షార్ట్ వీడియో కంటెంట్ వంటి విభాగాలపై దృష్టి పెట్టనుంది. ఇదే సమయంలో My11Circle, MPL వంటి గేమింగ్ సంస్థలు కూడా ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి.