భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
12ఆగష్టు,2025.
✍️దుర్గా ప్రసాద్
అటవీశాఖలో సెక్షన్ ఆఫీసర్ గా 37 సంవత్సరాలు విధులు నిర్వహించి జూన్ 30 న ఉద్యోగ విరమణ పొందిన భూక్య శంకర్ అందరూ ముద్దుగా పిలుచుకొనే ఫారెస్ట్ శంకరన్నగా పేరు పొందారు.
మంగళ వారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం బొల్లోరిగూడెంలో వెలసిన శ్రీ లలిత కామేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మ కర్త శివలెంక అశ్విని కుమార్ ఆధ్వర్యంలో శంకర్ ను ఘనంగా సన్మానించారు.
ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ…
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో అందరి చేత అందరివాడుగా పేరు సంపాదించుకున్నాడని, ఎవరు కలసిన నవ్వుతూ పలకరించి మంచి చెడులు తెలుసుకొని అ వసరమైతే ఆర్ధిక సహాయం చేయడంలో ముందుంటాడని కొనియాడారు.
వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆపదలో వున్నవారిని ఆదుకోవడంలో ముందుటారని అందుకే ఆయనకు అంత పేరు వచ్చిందని తెలిపారు. ఆలయ అభివ్రుద్దిలో శంకర్ పాత్రను గుర్తుచేసుకున్నారు.
శుభాకాంక్షలు తెలుపుతూ ఆలయ కమిటి తరుపున మొక్కను బహుమానంగా అందించి, స్వీట్స్ పంపిణి చేసారు.ముందుగా శంకర్ కు పూలమాలలతో, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఉద్యోగ విరమణ అనంతరం ఆయన శేష జీవితం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరారు. ఆలయ ప్రధాన అర్చకునితో వేద ఆశీర్వాదం అందించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త శివలెంక అశ్విని కుమార్, ఆలయ ప్రధాన అర్థకులు ఆకొండి సాయి చైతన్య శర్మ, కమిటి సభ్యులు శనగ రామచందర్ రావు, చెరుకు అశోక్, జానకి ప్రసాద్, సమ్మిడి జనార్ధన్ రెడ్డి, సంగ్లోత్ రంజిత్, వేటా సుధాకర్ రెడ్డి, కోరెగట్టు వెంకట నారాయణ, ఆనాబత్తుల సురేందర్, మిత్రులు లాయర్ తోట మల్లేశ్వర్ రావు, బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రేగళ్ల శ్రీను, మాలంపాటి సూర్యనారయణ, తాండ్ర రాంబాబు, సాధం రామక్రిష్ణ, కేశబోయిన కోటేశ్వరరావు, బద్ది కిషోర్, కొత్తచెరువు హర్షవర్ధన్, పల్లపు యాకయ్య, కేశవ్, చారుగుండ్ల వెంకటేశ్వర్లు,సంపత్ మంత్రి, జూపూడి ప్రభాకర్, లింగ్యా నాయక్, బోసెట్టి సాంబయ్య,గంధం యాదగిరి, శివ ప్రసాద్, తాళ్లూరి ప్రసాద్, బాబ్జీ, పోటు ప్రవీణ్, మల్లయ్య తదితరులు పాల్గొని సన్మానించారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
