మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 15 ఆగస్టు 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.
బెల్లంపల్లి: శుక్రవారం రోజున కాంట చౌరస్తా పల్లెటూరి బస్టాండ్ ప్రాంతంలో అమ్మ ఒడి ఎన్.జి.ఓ అన్నదాత ప్రాజేక్ట్ మరియు టెక్నో డాన్స్ అకాడమీ ఆద్వర్యంలో అన్నదాన కార్యక్రమము విజయవంతంగా నిర్వహించారు.
శుక్రవారం ముఖ్య అతిగా విచ్చేసిన బెల్లంపల్లి 1వ పట్టణ సీఐ కే.శ్రీనివాస్ రావు మాట్లాడుతూ…
అన్నదాన కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఆపదలో ఉన్నవారికి అన్నదానం చేయడం గొప్ప పుణ్య కార్యంమనే ఉద్దేశంతో అమ్మ ఒడి అన్నదాత ప్రాజెక్ట్,టెక్నో డాన్స్ అకాడమి ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల నుండి జరుగుతున్న అన్నదాన కార్యక్రమం అభినందనీయమైనదని, సమాజంలో సేవా స్పూర్తిని ప్రోత్సహించే ఈ విధమైన కార్యక్రమాలు మరెన్నో జరుగాలని మనస్ఫూర్తిగా కోరుతూ, ఈ సందర్భంగా పేదలకు, అనాధలకు, నిరుపేద కుటుంబాలకు ఉచితంగా భోజనం అందించడం చాలా గొప్పదని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన ప్రతిఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసారు.
ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని, సమాజాన్ని మానవత్వం వైపు నడిపించాలన్నదే అందరి ఆశయం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో అమ్మ ఒడి సభ్యులు హనుమాండ్ల సువర్ణ, లెంకల శ్రావణ్ కుమార్, ఎండీ.ఏజాజ్, మాటూరి వర ప్రసాద్, ఎండీ.యుసుఫ్, చెందుపట్ల లింగమూర్తి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి ….
- ఈ నెల 13వ తేదీ సోమవారం నుండి ప్రజావాణి కొనసాగింపు~జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
- బెల్లంపల్లి అశోక్ నగర్ లో ఎక్కడి చెత్త అక్కడే
- దుర్గా దేవి ఆలయంలో దేదీప్యమానంగా వెలుగుతున్న వైష్ణో దేవీ జ్యోతి
- మున్సిపల్ ఆధ్వర్యంలో “స్వచ్చతా హీ సేవా” కార్యక్రమం నిర్వహణ…
- 18 వ వార్డు ఇందిరమ్మ కాలనీకి సీసీ రోడ్డు సౌకర్యం కల్పించాలని వినతి పత్రం సమర్పించిన బస్తీ వాసులు






