మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేది:9 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: కన్నాల గ్రామపంచాయతీలో కబ్జాకు గురైన ఎర్రకుంట చెరువుకు గండి కొట్టి, చెరువును మాయం చేసి అక్రమ వెంచర్ వేసి ప్లాట్ల విక్రయాల విషయమై రైతు సంఘాల ఐక్య వేదిక, కన్నాల గ్రామస్తులు మంచిర్యాల కలెక్టరేట్ లో ప్రజావాణి లో చేసిన పిర్యాదు మేరకు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశాలతో మంగళవారం బెల్లంపల్లి ఎంఆర్ఓ కృష్ణ తో పాటు రెవిన్యూ ఇనస్పెక్టర్,ఇరిగేషన్ డి.ఈ,ఏఈ లు పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతు సంఘాల ఐక్య వేదిక నాయకులు మాట్లాడుతూ…, సంబంధిత అధికారులు మంగళవారం 4 వ దఫా సర్వే నిర్వహించారని, ఎఫ్టిఎల్, బఫర్ జోన్లు కలిపి 14 ఎకరాల భూమి ఎర్ర కుంట చెరువు విస్తరించి ఉందని, ఎఫ్టీఎల్ జోన్ లో గల రియల్ ఎస్టేట్ వారు హద్దులు పెట్టుకున్న పోల్లను బుధవారం తొలగిస్తామని తెలిపారన్నారు.

అలాగే బుధవారం నుండి పనులు ప్రారంభిస్తామని, ఇసుక బస్తాలతో తాత్కాలిక గండి పూడ్చివేత పనులు జరుగుతాయని ఇరిగేషన్ అధికారులు తెలిపారని అన్నారు. అక్రమణలను వెంటనే తొలగించాలని తహసీల్దార్ కృష్ణ ఆదేశాలు జారీ చేసినట్టు వారు తెలిపారు. రెండు రోజులలో పూర్తి నివేదిక జిల్లా పాలన అధికారి కుమార్ దీపక్, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు పంపిస్తామని తెలిపినట్టు అన్నారు.

ఈ కార్యక్రమంలో రైతు కార్మిక సంఘాల నాయకులు టి.మని రామ్ సింగ్, ఎండీ.చాంద్ పాషా, అంబాల మహేందర్, గోగర్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు.