మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ: 5 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

బెల్లంపల్లి: శుక్రవారం మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు మిలా ఉల్ నబీ సందర్భంగా మైనారిటీ సభ్యుల అధ్వర్యంలో కాంటా బస్ స్టాండ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అథిధి గా ఏసీపీ రవి కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…, వినాయక నిమజ్జనం, మిలాన్ ఉల్ నబీ పండగల సందర్భంగా ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా శాంతి భద్రతలు విఘాతం కలిగించకుండా పండుగలు జరుపుకోవాలని కోరారు.

ఎలాంటి గొడవలు జరగకుండా శాంతి భద్రతలను పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని పీస్ కమిటీ సభ్యులకు సూచించారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మైనారిటీ సభ్యులు, వన్ టౌన్ సిఐ కే. శ్రీనివాస రావు, ఎస్.ఐ.రాకేష్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.