భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్
కొత్తగూడెం సింగరేణి క్లబ్ నందు కేర్ హాస్పిటల్ ఉచిత మెగా హెల్త్ క్యాంపు కార్యక్రమంలో ముఖ్య అథులుగా పాల్గొన్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు, జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ గారు, జిల్లా ఎస్పీ శ్రీ రోహిత్ రాజ్ గారు.
మాట్లాడుతూ ముందుగా మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఉచిత హెల్త్ క్యాంపు ఏర్పాటు చేసిన కేర్ హాస్పిటల్ యజమాన్యానికి మరియు బృందానికి ధన్యవాదాలు తెలిపారు.
పేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం కొరకు ఏర్పాటుచేసిన ఉచిత హెల్త్ క్యాంపును జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
అనంతరం సుమన్ టీవీ ఆధ్వర్యంలో బెస్ట్ డాక్టర్ అవార్డు అందుకున్న భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారిని శాలువాతో సన్మానించి, అభినందనలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, మాజీ ప్రజా ప్రతినిధులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- సమాచార హక్కు చట్టం వల్లే మెరుగైన ప్రభుత్వ పాలన సాధ్యం – రిటైర్డ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోటా దేవదానం
- BRS బీజేపీ కుటిల యత్నాల వలనే బీసీ ల రిజర్వేషన్ లకు కంటగింపైంది – రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల
- సమాచార హక్కు చట్టం – ప్రజల హక్కుల పరిరక్షణకు శక్తివంతమైన సాధనం : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్
- భద్రాచలం ఆసుపత్రిలో హెల్త్ కేర్ సిబ్బందికి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ప్రారంభం
- డాక్టర్ టి. అరుణ కుమారి గారికి మహాత్మా గాంధీ సేవా రత్న పురస్కారం






