భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ
✍️దుర్గా ప్రసాద్
ఆది దేవుడు గణేషుని పూజిస్తే సర్వ విఘ్నాలు తొలుగుతాయని రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.
పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని 5 వార్డు గాంధీనగర్ లో ఓం గణేష్ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో జరగనున్న గణపతి నవరాత్రి ఉత్సవాల మండప నిర్మాణాల పనులు సోమవారం కొత్వాల కర్ర పూజ చేసి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గణేషుని పూజతో అంతా శుభం జరుగుతుందని అన్నారు. నిర్వాహకులు నియమనిష్టలతో నవరాత్రి పూజలు నిర్వహించాలని కొత్వాల అన్నారు.
ఈ కార్యక్రమాల్లో కమిటీ సభ్యులు కేసు పాక వెంకటేశ్వర్లు. ముగిది శంకర్, పెద్దిని నవీన్, ధసలపురి ప్రశాంత్, ధసలపురి దుర్గా ప్రసాద్, శివ, శశి, ధీరజ్, బి. ఎల్. నవీన్, ఖలీల్, రమేష్, మహేష్, ప్రాంత పెద్దలు కొత్తపల్లి సోమయ్య, నందిగామ జయరాజు, వెంకన్న, పెయింట్ వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు అలెక్స్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి…
- భద్రాద్రి కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో సాయుధ పోరాట వారోత్సవాలు ప్రారంభం
- కేటీపీయస్ సొసైటీ ఎన్నికల్లో మూడోసారి విజయం సాధించిన వల్లమల ప్రకాశ్
- పాల్వంచలో సిపిఐ నేతల నివాళులు అర్పించారు…
- డబ్ల్యు పిఎస్ & జిఏ ఆధ్వర్యంలో 12 నుండి 14 వరకు జరిగే డిపార్ట్మెంటల్ పోటీలు
- కొత్తగూడెం నుండి బెల్గావి ఎక్స్ ప్రెస్ , కాజీపేట రైళ్ళను పునరుద్ధరించాలి…
