భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
డిఎస్పీకార్యాలయం,
కొత్తగూడెం
✍️దుర్గా ప్రసాద్

ఈ నెల మూడవ తారీఖున చంద్రుగొండ మండలంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి పర్యటన సందర్భంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసు వారు ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టడం జరుగుతుందని కొత్తగూడెం డిఎస్పి రెహమాన్ ఒక ప్రకటనను విడుదల చేశారు.

VM బంజర నుండి చంద్రుగొండ మీదుగా కొత్తగూడెం వైపు వచ్చే వాహనాలు కల్లూరు, తల్లాడ, ఏన్కూరు మరియు జూలూరుపాడు మీదుగా కొత్తగూడెం చేరుకోవాలి.

అదే విధంగా కొత్తగూడెం నుండి VM బంజర వైపు ప్రయాణించే వాహనదారులు జూలూరుపాడు,ఏన్కూరు,తల్లాడ మరియు కల్లూరు మీదుగా VM బంజర వైపు ప్రయాణించాలని కోరారు.

ఇట్టి ట్రాఫిక్ డైవర్షన్ మూడవ తేదీన ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని తెలిపారు.

ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా వాహనదారుల ప్రయాణానికి ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు తలెత్తకుండా, ట్రాఫిక్ లో చిక్కుకోకుండా పోలీసు వారు చేపట్టే ట్రాఫిక్ డైవర్షన్ ను గమనించి ప్రజలు సహకరించాలని డిఎస్పీ ఈ సందర్బంగా కోరారు.