మంచిర్యాల జిల్లా,
బెల్లంపల్లి,
తేదీ:4 సెప్టెంబర్ 2025,
✍️ మనోజ్ కుమార్ పాండే.

నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన అక్రమ నిర్మాణాలు కూల్చివేస్తాము~సబ్ కలెక్టర్ మనోజ్…

బెల్లంపల్లి: గురువారం బెల్లంపల్లి పట్టణంలోని ఎస్.బీ.హెచ్ బ్యాంకు ప్రక్కకు మురికి కాలువను ఆక్రమించి కట్టిన నిర్మాణంపై స్థానిక కాంగ్రెస్ నాయకుడు, రేవంత్ రెడ్డి సైన్యం కార్యదర్శి కొలిపాక శ్రీనివాస్ ప్రజావాణి లో ఇచ్చిన పిర్యాదు మేరకు పరిశీలించారు.

అనంతరం ఆంధ్రా బ్యాంక్ ప్రక్క సంధి వద్దకు వెళ్ళి పరిశీలించారు. ఆకస్మిక వరదల సమయంలో కాలువ నీరు పోకుండా నిర్మాణాలు చేపట్టడంతో అక్కడి యజమానుల నిర్మాణాల లోకి మురికి కాలువ నీరు, వరద నీరు వోస్తుందని సబ్ కలెక్టర్ కు తమ గోడు వెల్లబుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… నాళాల పై, నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను కూల్చివేస్తామని తెలిపారు. ఎవరైనా సరే ప్రభుత్వ భూములను ఆక్రమించినా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టినా నేరుగా తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు. బెల్లంపల్లి పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ పూర్తిగా సహకరించాలని కోరారు. సబ్ కలెక్టర్ మనోజ్ పర్యటన పట్ల ప్రజలు ప్రశంశల జల్లులు కురిపించారు.

ఈ కార్యక్రమంలో ఎం.ఆర్.ఓ. కృష్ణ,మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్, డీఈ,ఏఈ, టీ.పీ.ఓ లు పాల్గొన్నారు.