పాండురంగాపురం గ్రామంలో ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం

భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
పాల్వంచ మండలం
పాండురంగాపురం గ్రామం
✍️దుర్గా ప్రసాద్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని పాండురంగాపురం గ్రామంలో, బీజేపీ నాయకుడు దాసరి రమేష్ ఆధ్వర్యంలో “ఇంటింటికి బీజేపీ” కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మోడీ గారు గత 11 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి పనులను వివరిస్తూ గృహాల గోడలపై వాల్ పోస్టర్లు అతికించారు. అదేవిధంగా, ప్రతి కుటుంబానికి జరిగిన అభివృద్ధి కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలు పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు భూక్యా సీతారాం నాయక్, బుడగం రవి, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, దోమల రమేష్, భూక్యా వెంకట్, డీ. రాజు, మాలోత్ ప్రశాంత్, మాదారపు లక్ష్మణ్, నరేష్ ,మల్లం సాగర్ , సన్నీ తదితరులు పాల్గొన్నారు.