భద్రాద్రి – కొత్తగూడెం జిల్లా
మణుగూరు
✍️దుర్గా ప్రసాద్

పీకే ఓ సి ఔట్ సోర్సింగ్ పనులలో ఏర్పడిన ఖాళీలలో కేవలం భూ నిర్వాసితులను మాత్రమే పెట్టుకోవాలని ఎండి ఎన్.బలరాం ఆదేశాల అమలు చేయాలి

పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ కి వినతి పత్రం అందజేసిన సామాజిక సేవకులు కర్నే బాబురావు

మణుగూరు ఏరియా పీకే ఓ సి ఔట్ సోర్సింగ్ టెండర్ పనులలో ఏర్పడిన ఖాళీలలో కొత్త టెండర్లలో భూ నిర్వాసితులను మాత్రమే పెట్టుకోవాలని ఎండి ఎన్. బలరాం ఆదేశాల అమలు చేయాలని కోరుతూ శనివారం నాడు పీకే ఓసి ప్రాజెక్ట్ అధికారి తాళ్లపల్లి లక్ష్మీపతి గౌడ్ కి వినతి పత్రం అందజేసినట్లు సామాజిక సేవకులు కర్నే బాబురావు విలేకరులకు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి వ్యాప్తంగా ఔట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పనులలో అనగా సివిల్ , పర్చేజ్ , సెక్యూరిటీ మరియు ఓబి కాంటాక్ట్ పనులలో ఏర్పడే ఖాళీలలో, నూతన టెండర్లలో కేవలం సింగరేణి భూ నిర్వాసితులను మాత్రమే అవకాశం కల్పించాలని గౌరవ సింగరేణి సిఎండి ఎన్. బలరాం (ఐఆర్ఎస్) ఆదేశాలు టెండర్ షరతులలో కూడా ఈ అంశాన్ని నూతనంగా చేర్చారు.

అయితే పీకే ఓసి లో కొంతమంది కాంట్రాక్టర్లు యాజమాన్యానికి సమాచారం లేకుండానే గుట్టు చప్పుడు కాకుండా నిర్వాసితులేతరులను మెడికల్ విటిసి చేపిస్తూ గతంలో పని చేశారని మరొకటిని బ్యాక్ డోర్ లో పనిలోకి పెట్టే ప్రయత్నం చేస్తున్నారనీ ఇప్పటికే కొంతమందిని పనుల్లో పెట్టారని ఆయన ఆరోపించారు. పర్చేజ్ టెండర్ల లోని ఆయిల్ బ్యారెల్స్ లిఫ్టింగ్, వాషింగ్ ప్లాంట్, మక్ రిమూవల్ , సివిక్, పారిశుద్ధ్యం పనులలో కొత్తవారిని పెట్టారనీ విశ్వసనీయంగా తెలిసిందన్నారు దీనికి సంబంధించి ఏరియా రిప్రజెంటేటివ్ యూనియన్ ఐ ఎన్ టి యు సి నాయకులు కూడా పైసలు పెట్టు పని కొట్టు అని ఆరోపిస్తూ పత్రికలకు ప్రకటనలు కూడా చేశారని దయచేసి ఈ విషయంపై మల్లేపల్లి ఓసీలో భూములు కోల్పోబోతున్న నిర్వాసితులకు, కోల్పోయిన వారికి ప్రభావిత గ్రామాల ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కోరారు.